TTD: టీటీడీ బోర్డులో భానుకు దక్కిన చోటు
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:41 AM
టీటీడీ బోర్డులో తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డికి చోటు దక్కింది.
ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అవకాశం
బీజేపీ కోటా ఓకే.. సజీవంగా టీడీపీ నేతల ఆశలు
తిరుపతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డులో తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డికి చోటు దక్కింది. తొలుత ఖరారైన జాబితాలో 25 మందికి గానూ ఛైర్మన్, 23 మంది సభ్యులతో కలిపి 24 పేర్లే వుండగా.. శుక్రవారం వెలువడిన జీవోలో 24వ సభ్యుడిగా జి.భానుప్రకా్‌షరెడ్డిని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తరచూ పార్టీ గొంతుకను బలంగా వినిపించిన ఈయనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కింది. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు టీటీడీ ప్రయోజనాల కోసం ఆయన చెప్పుకోదగ్గ పోరాటం చేశారు. టీటీడీ నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళించడాన్ని వ్యతిరేకించారు. వకుళమాత ఆలయ స్థలాన్ని పరిరక్షించడంలో.. అలిపిరి వద్ద గోపూజ మందిరం ఏర్పాటు వెనుకా ఆయన కృషి వుంది. వైసీపీ హయాంలో నేరచరిత్ర కలిగిన వారిని టీటీడీ సభ్యులుగా నియమించడాన్ని, తిరుపతి అభివృద్ధికి టీటీడీ నుంచి రూ. వంద కోట్లు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. ఈ అంశాలపై హైకోర్టులో న్యాయపోరాటం సాగించారు. ఓ దశలో అప్పటి అధికారులు ఆయనకు శ్రీవారి దర్శనాలు సైతం నిలిపివేసి వేధించారు. 2015-17 నడుమ రెండేళ్ళ పాటు టీటీడీ పాలకమండలి సభ్యుడుగా పనిచేసిన భానుప్రకా్‌షరెడ్డికి దేవస్థానం వ్యవహారాలపై లోతైన అవగాహన వుంది. బీజేపీలో ఉన్నత స్థాయి నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయనకు అనుకూలంగా మారింది. బీజేపీ కోటాలో బోర్డు మెంబరు కోసం తీవ్ర పోటీ నెలకొనగా చివరకు భానుప్రకా్‌షరెడ్డికి దక్కింది.
తుడా చైర్మన్‌కు ఎక్స్‌అఫిషియో హోదా
టీటీడీ బోర్డులో తిరుపతికి చెందిన నేతలకు అవకాశం దక్కలేదు. అయితే తుడా ఛైర్మన్‌కు ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించడంతో ఇక్కడి నేతల ఆశలను సజీవంగా ఉంచుతోంది. గతంలో ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వం తుడా ఛైర్మన్‌కు టీటీడీలో సభ్యత్వం కల్పించిన దాఖలాలు లేవు.అయితేతాజా జీవోలో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించడంతో తుడా ఛైర్మన్ పదవికి క్రేజ్ పెరిగింది.దీంతో ఇపుడు తిరుపతికి చెం దిన ముఖ్య నేతల దృష్టి తుడా ఛైర్మన్ పదవిపై మళ్లి ంది. ఇక, ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావన జీవోలో లేకపోయినా,తదుపరి ఎప్పుడైనా ప్రభుత్వం ఇద్దరు లేదా ముగ్గురిని నియమించే అవకాశముంది.ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి ఇతర ముఖ్య నగరాల్లోని ఆరు లోకల్ అడ్వైజరీ కమిటీల అధ్యక్షులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించే అవకాశమూ వుంది. ఆ కోటాలో తిరుపతి వారికి అవకాశం వుండదు కాబట్టి ప్రత్యేక ఆహ్వానితుల పదవులపైనే స్థానిక నేతలు ఆశపడుతున్నారు.
తిరుపతి ఎమ్మెల్యేకు అవకాశంపై అనిశ్చితి
తిరుపతి ఎమ్మెల్యేకి టీటీడీ ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడి హోదా దక్కుతుందా లేదా అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో చిరంజీవికి.. వైసీపీ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఆ హోదా కల్పించింది. టీడీపీ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఈ హోదా ఇవ్వలేదు. దీంతో తాజా బోర్డులో ఆ హోదా ఇస్తారా ఇవ్వరా అన్నదానిపై స్పష్టత రాలేదు.
Updated Date - Nov 02 , 2024 | 01:41 AM