YSRCP: చిత్తూరులో వైసీపీకి ఊహించని షాక్
ABN, Publish Date - Jul 05 , 2024 | 10:40 AM
చిత్తూరు: కార్పొరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డితో సహా పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
చిత్తూరు: కార్పొరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి భారీ షాక్ (Big Shok) తగిలింది. నగర మేయర్ (Mayor) అముద, డిప్యూటీ మేయర్ (Deputy Mayor) రాజేష్ రెడ్డితో సహా పలువురు కార్పొరేటర్లు (Corporators) తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ (MLA Gurjala Jaganmohan) ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. దీంతో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో వైసీపీ పాలకవర్గం పదవి కోల్పోయే ప్రమాదం ఉంది.
కాగా సాధారణ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో వైసీపీ కకావికలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలకు టీడీపీ బ్రేకులు వేస్తోంది. ఫ్యాన్ పార్టీలోనే కొనసాగితే పొలిటికల్ ప్యూచర్ ముగిసినట్టేనని లోకల్ బాడీస్ ప్రతినిధులు టెన్షన్ పడుతున్నారు. తెలుగుదేశంను సేఫ్ జోన్‌గా భావిస్తున్నా.. ఆ పార్టీలో డోర్‌లు మూసుకుపోయాయి.. ప్రత్యామ్నాయంగా జనసేనవైపు చూస్తున్నట్లు సమాచారం.
Updated Date - Jul 05 , 2024 | 01:10 PM