ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: చిత్తూరులో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

ABN, Publish Date - Aug 31 , 2024 | 10:23 AM

Andhrapradesh: చిత్తూరులో ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. హరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హరి హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కార్ పార్కింగ్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

businessman commits suicide,

చిత్తూరు, ఆగస్టు 31: చిత్తూరులో (Chittoor) ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. హరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హరి హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కార్ పార్కింగ్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే చిత్తూరు టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Rain Alert: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. రెండు ఇళ్లు ధ్వంసం


హరి ఆత్మహత్యకు ముందు అతని డ్రైవర్‌కు ఫోన్ చేసి తాను త్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు రావాల్సిన అప్పులు రాకపోవడం, తను చెల్లించాల్సిన అప్పులు వారికి చెల్లించకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.


ఈ వార్త కూడా చదవండి..

Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?




యన్టీఆర్‌ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మైలవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. మరోవైపు విజయవాడలోనూ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ్యాన్ హోల్స్ నిండిపోవడంతో నీరు రోడ్లమీదకి చేరుకుంది.


ఇవి కూడా చదవండి...

Viral: ఈ కండోమ్‌లు కొంటున్నారా.. అంగట్లో సరకుగా మీ వ్యక్తిగత డేటా

Congress: కాంగ్రెస్‌ ఖాతాలోకి పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 10:30 AM

Advertising
Advertising