ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: కలకత్తా ఘటనపై ఏపీ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు.. రోగుల ఆగ్రహం

ABN, Publish Date - Aug 17 , 2024 | 11:21 AM

Andhrapradesh: కలకత్తాలో కలకత్తాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. వైద్యురాలిపై జరిగిన దురాగతంపై తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యులు ఓపీలు బాయికాట్ చేశారు. ఓపీలు లేదని తెలియక నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వందలాది మంది రోగులు తరలివచ్చారు.

Tirupati Ruia Hospital

తిరుపతి, ఆగస్టు 17: కలకత్తాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. వైద్యురాలిపై జరిగిన దురాగతంపై తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రిలో వైద్యులు ఓపీలు బాయికాట్ చేశారు. ఓపీలు లేదని తెలియక నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వందలాది మంది రోగులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఓపీ వైద్య సేవల కోసం రోగులపడిగాపులు కాస్తున్న పరిస్థితి.

AP Politics: రాజకీయ విలువలకు ప్రాధాన్యత.. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు కలిసొచ్చిన అదృష్టం..


ఒకరు చనిపోయారని వేలాది మందిని చంపేస్తారా వైద్యులకు, వైద్య విద్యార్థులకు రోగులు సూటి ప్రశ్న వేస్తున్నారు. అక్కడెక్కడో జరిగితే ఇక్కడ రోగుల్ని ఇబ్బంది పెట్టడం మరణాలకు కారణం అవడం సమంజసమా అని నిలదీస్తున్న పరిస్థితి. ఘటన జరిగిన చోట నిందితులను ఉరి తీయాలని అంతే కానీ... ఇక్కడ రోగుల్ని ఇబ్బంది పెట్టడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. కొద్ది మంది వైద్యులు నిరసన చేసి కొద్దిమంది వైద్య సేవలు అందించొచ్చు కదా అని అడుగుతూ.. అందరూ మూకుమ్మడిగా వైద్య సేవలు చేయకపోవడం భావ్యమా అని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలవనున్నారంటే?


దేశ వ్యాప్తంగా బంద్...

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. దీంతో నేడు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సమ్మె జరుగుతోంది. ఈ సమయంలో అత్యవసర రోగులకు మాత్రమే వైద్య సేవలు అందిస్తారు.


ఇవి కూడా చదవండి...

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

Read Latest AP News And Telangana News

Updated Date - Aug 17 , 2024 | 11:34 AM

Advertising
Advertising
<