Elephant: పంటలపై గజదాడులు

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:20 AM

పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేవళంపేటలో 75 కొబ్బరి, 17 మామిడిచెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Elephant: పంటలపై గజదాడులు
ఏనుగులు విరిచేసిన కొబ్బరిచెట్లు

కల్లూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేవళంపేటలో 75 కొబ్బరి, 17 మామిడిచెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రికుంటవారిపల్లెలోని రైతు వెంకటాచలం 30 ఏళ్ల క్రితం తన నాలుగు ఎకరాల మామిడితోట చుట్టూ కొబ్బరిచెట్లను నాటి వాటి నుంచి ఫలసాయాన్ని పొందుతున్నాడు. శనివారం రాత్రి తూర్పు అటవీప్రాంతంలోని చింతలవంక నుంచి 16 ఏనుగుల గుంపు ఈ మామిడితోటలోకి ప్రవేశించి సుమారు 50 కొబ్బరిచెట్లను విరిచేసి, కొబ్బరిచెట్లను, విద్యుత్‌ స్తంభాన్నీ నేలకూల్చాయి. ఆరు మామిడి, మూడు జామ, మూడు మునగచెట్లు, నీటిపైపులను ధ్వంసం చేశాయి. ఇదే గ్రామంలోని రైతు కృష్ణయ్యకు చెందిన 26 కొబ్బరి, ఏడు మామిడిచెట్లతోపాటు అల్లనేరేడు చెట్టును ఏనుగులు విరిచేశాయి. అనంతరం వచ్చిన మార్గంలోనే అడవిలోకి తిరుగుముఖం పట్టాయి. ఏనుగుల గుంపు నేలమట్టం చేసిన కొబ్బరిచెట్లను ఆదివారం ఉదయం చూసిన రైతులు వాపోయారు. ధ్వంసమైన పంటలను ఎఫ్‌బీవో మున్నా పరిశీలించారు.

Updated Date - Nov 11 , 2024 | 01:20 AM