AP News: మద్యం సేవిస్తూ పట్టుబడ్డ రుయా ఆస్పత్రి ఉద్యోగి
ABN, Publish Date - Mar 20 , 2024 | 10:11 AM
Andhrapradesh: రుయా ఆస్పత్రిలో ఉద్యోగులు తాగుబోతుల అవతారం ఎత్తారు. రుయా ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీఐటీయూ ఆఫీస్లో మద్యం సేవిస్తూ ఉద్యోగులు పట్టుబడ్డారు. రోగుల వార్డులలో నీరు రావడం లేదని ఏఆర్ఏంఓ హరికృష్ణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాటర్ మ్యాన్ సుబ్రహ్మణ్యం అందుబాటులో లేకపోవడంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
తిరుపతి, మార్చి 20 : తిరుపతి (Tirupati) రుయా ఆస్పత్రిలో (Ruya Hospital) ఉద్యోగులు తాగుబోతుల అవతారం ఎత్తారు. రుయా ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీఐటీయూ ఆఫీస్లో మద్యం సేవిస్తూ ఉద్యోగులు పట్టుబడ్డారు. రోగుల వార్డులలో నీరు రావడం లేదని ఏఆర్ఏంఓ హరికృష్ణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాటర్ మ్యాన్ సుబ్రహ్మణ్యం అందుబాటులో లేకపోవడంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సీఐటీయూ కార్యాలయంలో మద్యం సేవిస్తూ సుబ్రహ్మణ్యం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కార్మికుల సంక్షోభం కోసం ఇచ్చిన సీఐటీయూ ఆపీసును బార్గా మార్చిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా.. సుబ్రహ్మణ్యం మద్యం సేవిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వైసీపీ నేతల ఒత్తిడితోనే వాటర్ మ్యాన్పై రుయా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
Rains: ఏపీలో భారీ వర్ష సూ చన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...
IPL 2024: నన్ను కింగ్ అని పిలవొద్దు.. ఎందుకంటే..? కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 20 , 2024 | 11:34 AM