Rain Alert: ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు..
ABN, Publish Date - Oct 14 , 2024 | 09:55 AM
ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అమరావతి: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం (Low pressure) ప్రభావంతో తిరుపతి (Tirupati), చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore), ప్రకాశం (Prakasam), అన్నమయ్య జిల్లాల్లో (Annamaya District) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ శెలవు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్పపీడనం, తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ కార్తీక్ తీర ప్రాంతాలు, పెన్నా తీరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని ఆదేశించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఆదివారం ఆయన వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడా నికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
* పెన్నానది గట్లను పరిశీలించాలి
పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పెన్నా నది గట్లను పరిశీలించాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్నా, గుడ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నాకి వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. యజమానులతో మాట్లాడి బోట్లు, ఎక్స్కవేటర్లను సిద్ధంగా ఉంచుకో వాలని ఆదేశించారు. వాటి తరలింపునకు వాహనాలను, మనుషులను సిద్ధంగా చేసుకోవాలన్నారు. ప్రాణనష్టంకాని, పశునష్టం కాని జరకుండా చూడాలన్నారు. నిత్యావసరా ఆహార పదార్థాలు, పాలు, కూరగాయల వాహనాలు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాల్లోని తాగునీటి ట్యాంకుల్లో ముందుగా నీటిని నింపుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..
రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 14 , 2024 | 10:05 AM