Chandrababu: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. గతానికి భిన్నంగా ఆలయ మర్యాదలు
ABN, Publish Date - May 11 , 2024 | 09:13 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.
తిరుమల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లలో ఉన్న.. భక్తుల దగ్గరకు వెళ్లి చంద్రబాబు అభివాదం చేశారు. తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు బయల్దేరారు.
అపూర్వ స్వాగతం...
కాగా.. తిరుమలలో చంద్రబాబుకు పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. గతానికి భిన్నంగా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేసింది. అతిథి గృహం వద్ద పోలీస్ అధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు దర్శనానికి వచ్చే సమయంలో క్యూ కాంప్లెక్స్, ఆలయం వద్దకు భక్తులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. అలాగే శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లే సమయంలో క్యూ లైనును నిలిపివేసి మరి స్వామి వారి దర్శన భాగ్యం టీటీడీ అధికారులు కల్పించారు. ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు వీస్తుండటంతోనే పోలీస్, టీటీడీ అధికారుల్లో కూడా మార్పు వచ్చిందని భక్తులు చర్చించుకుంటున్నారు.
AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!
Read Latest AP News And Telugu News
Updated Date - May 11 , 2024 | 09:51 PM