Tirumala: వీకెండ్ వచ్చేసింది.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
ABN, Publish Date - Feb 24 , 2024 | 08:16 AM
తిరుమలలో నేడు (శనివారం) భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. నేడు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
Tirumala: తిరుమల (Tirumala)లో నేడు (శనివారం) భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. నేడు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం 62,880 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.03 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 24 , 2024 | 08:16 AM