ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:14 AM

తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ను..

YS Jagan

జగన్ తిరుమల పర్యటనపై వివాదం కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. గత ఐదేళ్లుగా జగన్ ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ తిరుమల దర్శనానికి వెళ్లడాన్ని ఎవరూ వ్యతిరేకించనప్పటికీ.. సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఓవైపు వైసీపీ అధ్యక్షుడి తిరుమల పర్యటన వేళ హైందవ సంఘాలు, శ్రీవారి భక్తులు జగన్ రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. అదే సమయంలో శనివారం రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో జగన్ భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్ తిరుమల దర్శనానికి వెళ్తే డిక్లరేషన్‌లో సంతకం చేస్తారా లేదా తిరుమల సంప్రదాయాలపై రాజకీయం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒక్కో ఆలయంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. వాటిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ఈ విషయంలో రాజకీయాలకు తావుండదని పలువురు హైందవ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కానీ కొద్దిరోజులుగా ఏపీలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని.. వైసీపీ నేతలు తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని హైందవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

Raghurama Case: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం


నోరు మెదపని వైసీపీ..

జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే అంశంపై ఆ పార్టీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వని సమయంలో అప్పటి విపక్షాలు ప్రశ్నించినా.. దానిని వైసీపీ నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తిరుమల సంప్రదాయాలను, నిబంధనలను పాటించాల్సిందేనని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తుండటంతో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. తిరుమల వెళ్లిన తర్వాత డిక్లరేషన్ విషయాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతోనే జగన్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. తనను దర్శనానికి అనుమతించలేదని, ఆంక్షలు పెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ఆలోచనలో జగన్ ఉండొచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అమరావతి: APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్


డిక్లరేషన్ ఇస్తారా..

జగన్ తిరుమల పర్యటనపై వివాదం నెలకొనడంతో జగన్ ఓ అడుగు వెనక్కు వేసి డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో.. ఈ వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు స్పెల్ఫ్ డిక్లరేషన్ దరఖాస్తుపై జగన్ సంతకం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు తిరుపతి చేరుకుని.. రేపు జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకుంటారు.


రెడ్‌ బుక్‌ అమలు మొదలైంది!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 27 , 2024 | 11:14 AM