ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నా భార్యను శిక్షించండి.. నా కుమారుడిని కాపాడండి..

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:05 AM

Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన మోహనాచారికి భార్య, కుమారుడు ఉన్నాడు. అయితే తన భార్యను సచివాలయంకు చెందిన ఓ ఉద్యోగి ట్రాప్ చేశాడంటూ మోహనాచారి ఆత్మహత్య చేసుకున్నాడు.

Man commits suicide in Chittoor

చిత్తూరు, డిసెంబర్ 24: జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెనుమూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన మోహనా చారి (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మోహనాచారి తీసిని సెల్పీ వీడియో వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు కారణాలు అందులో వివరించాడు. తన భార్యను ట్రాప్ చేశారని.. ఆమెను కూడా శిక్షించాలి అంటూ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం మోహనాచారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్


గ్రామానికి చెందిన మోహనాచారికి భార్య, కుమారుడు ఉన్నాడు. అయితే తన భార్యను సచివాలయంకు చెందిన ఓ ఉద్యోగి ట్రాప్ చేశాడంటూ మోహనాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గుంటీపల్లి సచివాలయంకు చెందిన ఉద్యోగి కారణం అంటూ బాధితుడు సెల్పీ వీడియోలో తెలిపాడు. ‘‘నా భార్యను సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేసి నాకు దూరం చేశాడు. వారిద్దరిని శిక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి చేస్తూ’’ పలువురికి మోహనాచారి వీడియో కాల్ చేసి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ‘‘ఆ ఉద్యోగితో పాటు నా భార్యను శిక్షించండి. నా 8 ఏళ్ల కుమారున్ని కాపాడండి’’ అంటూ వీడియో కాల్ ద్వారా సీఎం, డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశాడు బాధితుడు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. క్వారీలో దూకడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మోహనా చారి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సెల్ఫీ సూసైడ్‌పై కేసు నమోదు చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో దర్శనం కోసం కాసేపట్లో టికెట్ల విడుదల.. త్వరపడండి



బాలుడి అనుమానాస్పద మృతి

మరోవైపు విశాఖలో పదమూడేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరుష్ అమన్ (13) అనే బాలుడు బాత్రూంలో షూ లేస్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు జార్ఖండ్‌లో ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో అమన్ విశాఖలో తాత నివాసంలో ఉంటున్నాడు. ఈక్రమంలోనే బాలుడు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే బాలుడు ఎక్కువగా మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడుతుంటాడని తాతా వినోద్ కుమార్ షా.. పోలీసులకు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 11:07 AM