చిత్తూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:44 AM
దేశవ్యాప్తంగా 72 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా ఉంది.
వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని
చిత్తూరు రూరల్, ఫిబ్రవరి 26: దేశవ్యాప్తంగా 72 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా ఉంది. రూ.13.99 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ మాట్లాడుతూ.. గతంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకే ఉండేదని, తాను చిత్తూరు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయతో మాట్లాడి చిత్తూరు వరకు రప్పించామన్నారు. గుంతకల్లు సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ పనులన్నీ సంవత్సరంలోపు పూర్తి అవుతాయన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు రైళ్లల్లో ప్రయాణాలు బాగా పెరిగాయని, అందుకు తగ్గట్టుగా స్టేషన్లలో సౌకర్యాలు లేవన్ననరు. అందుకనే అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆఽధునికీకరణకు ప్రధాని శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుటకున్నాయి. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, చిత్తూరు స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, వాణిజ్య ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఆర్‌పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, జీఆర్‌పీ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, సీపీఐ నాయకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
అండర్ రైల్వే బ్రిడ్జి ప్రారంభం
పెనుమూరు: పెనుమూరు క్రాస్‌లో రూ.3 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్‌బ్రిడ్జిని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు వాసుదేవ నాయుడు, జిల్లా కార్యదర్శి జీకే చౌదరి, పూతలపట్లు మండలాధ్యక్షుడు నరసింహులు నాయుడు, రైల్వే అధికారులు మధుసూదనయ్య, వేణుమాదవ్, ఉదయరామసింగ్, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.