Today Gold Rate: ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 07:36 AM
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో గోల్డ్, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Today Gold Rate: శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ (Wedding season) ప్రారంభం కావడంతో బంగారం ధరలు (Gold Price) రోజు రోజుకు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ (International ) పరిణామాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయినప్పటికీ బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లగోల్డ్ 10 గ్రాములు ధర రూ.10 పెరిగి రూ. 80,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 87,990గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఇలాగే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 80,810 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,140గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 87,990గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Read More News..
14.2 కిలోల బంగారం నడుముకు కట్టుకుని..
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 80,660 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 87,990గా ఉంది. అలాగే పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 80,660 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 87,990గా నమోదైంది. అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 80,710 కాగా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 88,040గా కొనసాగుతోంది. భువనేశ్వర్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,660.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,990గా ఉంది.
వెండి ధరలు..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 97,900 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 98,000గా ఉండేది. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,06,900గా ఉంది. కోల్‌కతాలో రూ. 99,400, బెంగళూరులో రూ. 97,900గా ఉంది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ హెచ్చరికలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘ఢిల్లీ’ని మించి జగన్ అవినీతి
తిరుమల నడక దారిలో యువకుడి మిస్సింగ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News