ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teacher: టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:53 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా పడింది.

నోటీసు బోర్డులోని సీనియారిటీ జాబితాను మొబైల్‌ వెలుగులో పరిశీలిస్తున్న టీచర్లు

నేటి మధ్యాహ్నం నిర్వహణ

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఆదివారం స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి నాలుగు హెచ్‌ఎం పోస్టులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం ఎస్జీటీల నుంచి ఎస్‌ఏల పోస్టులకు పదోన్నతి కల్పించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని రెండు పోస్టులకు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 25 మందికి పదోన్నతి కల్పించాల్సి ఉంది. ఇందుకోసం సీనియారిటీ జాబితా ఆధారంగా 1:3 నిష్పత్తిలో టీచర్లను కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఉదయం 10 గంటలకు మొదలైన సీనియారిటీ జాబితా కసరత్తు రాత్రి 8.30 గంటలకూ కొలిక్కిరాకపోవడంతో విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.విద్యాశాఖలో మున్సిపల్‌ టీచర్లు విలీనం కాకముందు ఆ విభాగంలో పదోన్నతులు అడ్డగోలుగా జరిగాయనే విమర్శలున్నాయి. ఏనాడు కౌన్సెలింగ్‌ నిర్వహించని మున్సిపల్‌ అధికారులు, వారి పరిధిలోని యూనియన్‌ నాయకులు, ఇతరత్రా సిఫార్సుల మేరకు అడిగిన వారికి పదోన్నతులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. టీచర్లు డీఎస్సీ అర్హత సాధించిన సంవత్సరం, పాఠశాలలో చేరిన తేదీ, కేటగిరి, జడ్పీ నుంచి మున్సిపాలిటీలకు అప్షనల్‌పై వచ్చిన తేదీ పరిగణలోకి తీసుకోని మున్సిపల్‌ అధికారులు చేతివాటంగా పదోన్నతులు ఇవ్వడం, వాటి రికార్డులు విద్యశాఖకు పూర్తిగా ఇవ్వకపోవడం వంటి కారణాలతో తాజాగా తయారు చేసే సీనియారిటీ జాబితాలో తేడాలు ఉన్నట్లు డీఈవో కార్యాలయ అధికారులు గుర్తించారు. వీటిని సవరించడానికి, సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తెలపడానికి మూడు సార్లు అవకాశం ఇచ్చినా, మున్సిపల్‌ టీచర్లు స్పందించకపోవడంతో సమస్యగా మారింది.


చివరి నిమిషంలో సీనియారిటీ జాబితా సిద్ధం చేశారని తెలిసి పలువురు అభ్యంతరాలు తెలపడం విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. సవరణల అనంతరం రాత్రి 7 గంటల సమయంలో ఓ సీనియారిటీ జాబితాను నోటీసు బోర్డులో పెట్టగా, వాటిలోనూ తప్పులున్నట్లు ఇటు ఉపాధ్యాయులు, అటు టీచర్లు చెప్పడంతో సీనియారిటీ జాబితా కొలిక్కి రాలేదు. చేసేదేమి లేక మంగళవారం మధ్యాహ్నానికి మున్సిపల్‌ టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్‌ కోసం దూర ప్రాంతాల నుంచి డీఈవో కార్యాలయానికి వచ్చిన టీచర్లు ఈసురోమని తిరుగుముఖం పట్టారు. మున్సిపాలిటీ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసిన తర్వాత ఇదే తొలి పదోన్నతి కౌన్సెలింగ్‌ కావడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ ప్రక్రియపై దృష్టి సారించారు. తమ దృష్టికి వచ్చిన అభ్యంతరాలను చివరి క్షణంలో విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం వాయిదా పడటానికి మరో కారణంగా మారింది.

Updated Date - Dec 24 , 2024 | 12:53 AM