ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan:నాడు అలా.. నేడు ఇలా.. శవ రాజకీయాలకు కేరాఫ్ జగన్..!

ABN, Publish Date - Oct 07 , 2024 | 09:05 AM

రాష్ట్రంలో వైసీపీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే..

Punganur Incident

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా వైసీపీ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదట. ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలకు విసుగుచెందిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయం తెలిసినా.. వైసీపీ తనతీరును మార్చుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా బాలికపై నలుగురు హత్యాచారానికి పాల్పడ్డారంటూ వైసీపీ ఓ తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

ఏయూ ఇంజనీరింగ్‌కు ఐఐటీ హోదా?


ప్రభుత్వం ఈ ఘటనపై ఎంతో సీరియస్‌గా ఉందని, మృతికి కారణాలను తెలుసుకునేందుకు వేగంగా దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ శవ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పుంగనూరు ఘటనపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలే హత్యలు, హత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడితే నోరు మెదపని జగన్.. ప్రస్తుతం ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం ఏమింటూ కూటమి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

Flood Relief :: అకౌంట్‎లో పైసలు జమ కానీ వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!


నాడు అలా.. నేడు ఇలా

ఏపీలో 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. స్వయంగా వైసీపీ నాయకులే కొన్ని ఘటనల్లో నిందితులుగా ఉన్నట్లు అప్పట్లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించాయి. అయినప్పటికీ గతంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ ఎప్పుడూ వాటిపై స్పందించిన దాఖలాలు లేవు. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టి.. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా అప్పటి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. నేరాల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలు బయటకువచ్చినా.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శలు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం పుంగనూరులో మైనర్ బాలిక విషయంలో జగన్ అత్యుత్సాహం ప్రదర్శించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. నాడు స్పందించని జగన్.. రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రభుత్వ ప్రతిస్టను దిగజార్చేందుకు ప్రయతిస్తున్నారనే చర్చ జరుగుతోంది. విపక్ష పార్టీగా బాధిత కుటుంబాన్ని ఓదార్చి.. అండగా నిలవాల్సిన సమయంలో అసత్య ప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం సరికాదని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం శవ రాజకీయాలకు స్వస్తి పలుకుతారో లేదా వేచి చూడాలి.

22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 07 , 2024 | 10:37 AM