Share News

చిత్తూరు ఎస్పీకి వెండి పతకం

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:11 AM

జిల్లా వ్యాప్తంగా 13 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి డీజీపీ పతకాలను ప్రకటించారు. వీరికి ఎస్పీ జాషువాకు వెండి పతకాన్ని ప్రదానం చేయనున్నారు.

చిత్తూరు ఎస్పీకి వెండి పతకం
ఎస్పీ జాషువా

చిత్తూరు, మార్చి 27: జిల్లా వ్యాప్తంగా 13 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి డీజీపీ పతకాలను ప్రకటించారు. వీరికి ఎస్పీ జాషువాకు వెండి పతకాన్ని ప్రదానం చేయనున్నారు. పాలసముద్రంలో కానిస్టేబుల్‌ డి.వెంకటేశులుకు వెండి పతకం లభించింది. మిగిలిన 11 మందికి కాంస్య పతకాలను ప్రకటించారు. వీరిలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి (పలమనేరు), కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్‌, చిత్తూరు ఏఆర్‌ ఎస్‌ఐ రమేష్‌, పుంగనూరు అర్బన్‌ ఏఎ్‌సఐ ఎం.కె.వెంకటరత్నం, జీడీ నెల్లూరు హెడ్‌కానిస్టేబుల్‌ జగదీశ్‌, చిత్తూరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మధుకుమార్‌, గంగవరం కానిస్టేబుల్‌ అల్లావుద్వీన్‌, ఎస్‌ఆర్‌పురం కానిస్టేబుల్‌ మోహన్‌బాబు, చిత్తూరు ఒకటో పట్టణ కానిస్టేబుల్‌ రామకృష్ణ, వి.కోట అర్బన్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ ప్రతా్‌పకుమార్‌, చిత్తూరులో ఏఎ్‌సఐ మనోహర్‌ ఉన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 02:11 AM