ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TTD: జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవాల టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో విడుదల ఎప్పుడంటే?

ABN, Publish Date - Mar 13 , 2024 | 01:43 PM

Andhrapradesh: జూన్ నెల‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత‌సేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉద‌యం 10 గంటల నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్‌లకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

తిరుమ‌ల, మార్చి 13: జూన్ నెల‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత‌సేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మార్చి 18వ తేదీ ఉద‌యం 10 గంటల నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్‌లకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలాగే మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి 21న ఉదయం 10 గంటలకు జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే  జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ అవనున్నాయి.

  • మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్రదక్షిణం టోకెన్లు విడుదల..

  • మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్రస్టు దాత‌ల దర్శనం టిక్కెట్లు విడుదల..

  • మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టోకెన్స్ విడుదల..

  • మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల..

  • మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను టీటీడీ విడుద‌ల చేయనుంది.

ఇవి కూడా చదవండి...

NTR - Bharata Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న?.. నేడు కీలక నిర్ణయం!

Hyderabad: నగరంలో.. 3 రూట్లలో గ్రీన్‌మెట్రో బస్సులు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 13 , 2024 | 01:46 PM

Advertising
Advertising