ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suspension: తిరుపతి ఆర్డీవో సస్పెన్షన్‌

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:35 AM

తిరుపతి ఆర్డీవో నిషాంత్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో అప్పటి పుత్తూరు తహసీల్దారు పరమేశ్వరస్వామి (ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆత్మకూరు తహసీల్దారు), కలెక్టర్‌ కార్యాలయంలోని సంబంధిత సూపరింటెండెంట్‌ సురే్‌షబాబునూ సస్పెండు చేశారు.

నిషాంత్‌రెడ్డి

అప్పటి పుత్తూరు తహసీల్దారు, కలెక్టరేట్‌ సూపరింటెండెంటు కూడా సస్పెన్షన్‌

తిరుపతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఆర్డీవో నిషాంత్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఓ పెట్రోల్‌ బంకుకు ఎన్వోసీ ఇచ్చేందుకు తన క్యాంప్‌ క్లర్క్‌ ద్వారా రూ.లక్ష డిమాండు చేశారన్న బాధితుడి ఫిర్యాదు, అనంతరం వివిధ దశల్లో జరిగిన సుదీర్ఘ విచారణ మేరకు ఆయన్ను సస్పెండు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్వాపరాలను పరిశీలిస్తే.. పుత్తూరు సమీపంలో హెచ్‌పీసీఎల్‌ పెట్రోలు బంకు శ్రీనివాసులు కుటుంబానికి అన్ని అనుమతులతో మంజూరైంది. ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) కోసం ఫైలు ఆర్డీవో కార్యాలయానికి చేరింది. ఆర్డీవో నిషాంత్‌ రెడ్డి తన క్యాంప్‌ క్లర్క్‌ ద్వారా ఎన్వోసీ కోసం రూ.లక్ష డిమాండు చేశారని బాధితుడు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్వోసీ ఇవ్వాలని కలెక్టర్‌ సూచించినా మరోసారి తన సీసీ ద్వారా రూ.50వేలు వసూలు చేశారు.భూమార్పిడి కోసం మరో రూ.30వేలు డిమాండు చేయడంతో సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ శుభం బన్సల్‌తో విచారణ జరిపించగా, ఆయన ఆర్డీవోకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతో సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి విచారించాలని జేసీ శుభం బన్సల్‌ను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషాంత్‌రెడ్డిలో కలవరం మొదలైంది. తనపై ఫిర్యాదుచేసిన బాధితుడి ఇంటికి రెవెన్యూ అధికారులను పంపి, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపైనా మరోసారి సీసీఎల్‌ఏకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్డీవోపై సస్పెన్షన్‌ వేటు వేసి కేసును ఏసీబీకి అప్పగించాలని సీసీఎల్‌ భావించింది.


కాగా, ఎన్నికలకు ముందు చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించడంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆర్డీవో నిషాంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి దీనిపై పలుసార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పోలింగ్‌ అనంతరం తిరుపతిలో జరిగిన గొడవలపై వైసీపీది ఎలాంటి తప్పులేనట్టుగా నివేదిక ఇచ్చారు. మరో ఏడాదిలో ఐఏఎ్‌సగా పదోన్నతి లభించే అవకాశం ఉన్న అధికారి అవినీతి ఆరోపణలతో సస్పెండవడం చర్చనీయాంశమైంది. అలాగే, ఈ కేసులో అప్పటి పుత్తూరు తహసీల్దారు పరమేశ్వరస్వామి (ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆత్మకూరు తహసీల్దారు), కలెక్టర్‌ కార్యాలయంలోని సంబంధిత సూపరింటెండెంట్‌ సురే్‌షబాబునూ సస్పెండు చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 01:35 AM