AP Govt: టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్
ABN, Publish Date - Oct 31 , 2024 | 11:07 AM
Andhrapradesh: కొత్తగా ఏర్పటయ్యే టీటీడీ పాలకవర్గం నియామకంలో ఒకరు ఇద్దరు సభ్యులపై ఆరోపణల నేపథ్యంలో సర్కార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆరోపణలు ఉన్న సభ్యుల నియామకంపై సందిగ్ధం చోటు చేసుకుంది. టీటీడీ సభ్యుల నియామక జీవో జారీ చేస్తున్న తరుణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోంది.
అమరావతి, అక్టోబర్ 31: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకవర్గం నియామకం జీవో జారీపై ప్రతిష్టంభన నెలకొంది. కొత్తగా ఏర్పటయ్యే పాలకవర్గం నియామకంలో ఒకరు ఇద్దరు సభ్యులపై ఆరోపణల నేపథ్యంలో సర్కార్ (AP Government) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆరోపణలు ఉన్న సభ్యుల నియామకంపై సందిగ్ధం చోటు చేసుకుంది. టీటీడీ సభ్యుల నియామక జీవో జారీ చేస్తున్న తరుణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోంది.
Cyber Crime: చొప్పదండి ఎమ్మెల్యేకు బెదిరింపులు
టీటీడీ పాలకమండలిపై ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సభ్యులుగా పనిచేసిన వారిని మరలా ఈ ప్రభుత్వంలో సభ్యులుగా నియమించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన ఓ సభ్యుడి నియామకంపైనే ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అదే విధంగా టీడీపీలోకి ఎన్నికల ముందు వచ్చిన వారిని టీటీడీ పాలకవర్గంలో సభ్యులుగా ఎలా నియమిస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గంలో సభ్యుల నియామకానికి సంబంధించి ఆరోపణలు రావడం, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకరిద్దరు సభ్యుల నియామకానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈరోజు రేపటిలోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేడు దీపావళి సెలవు దినం కావడంతో సభ్యుల నియామకానికి సంబంధించిన జీవో విడుదలను ఈరోజు నిలిపివేయాలని నిర్ణయించారు. లేనిపక్షంలో ఈరోజు ఉదయం జీవో వచ్చే అవకాశం ఉండేది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే మహారాష్ట్ర సభ్యుడి నియామకం జరిగిందని టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సభ్యుడిని ఇప్పుడు కూడా నియమిస్తే ఇక పాలవర్గానికి అర్ధం ఏముందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నంలోపు పున:పరిశీలన పూర్తి అయితే సాయంత్రానికి జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది. లేనిపక్షంలో రేపు (శుక్రవారం) జీవో జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
24 మందితో టీటీడీ బోర్డు
కాగా.. 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన 23 మందిని సభ్యులుగా నియమించింది. వీరిలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది సర్కార్. అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో స్థానం కల్పించారు. టీటీడీ బోర్డులో ఏపీ తర్వాత తెలంగాణకే అధికార ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం దక్కింది. తొలి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న తెలంగాణకు చెందిన నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. రాజమండ్రికి చెందిన సాధారణ వ్యక్తి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది.
నంద్యాల జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా క్రిష్ణమూర్తికి అవకాశం దక్కింది. ఎన్నికల్లో క్రిష్ణమూర్తి గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిని సభ్యురాలిగా నియమించారు. అలాగే జనసేన నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, డిప్యూటీ సీఎం పవన్ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్‌సాయికి బోర్డులో అవకాశం లభించింది. ఇక ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి జాస్తి సాంబశివరావు, ఫార్మా రంగం నుంచి నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లాకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది. కాఫీ వ్యాపారి ఆర్‌ఎన్ దర్శన్, కుప్పం పారిశ్రామిక వేత్త శాంతరామ్, చెన్నైకి చెందిన పి.రామ్మూర్తిని సభ్యులుగా నియమించారు. కర్ణాటక నుంచి నరేష్ కుమార్‌కు చోటు కల్పించారు. ఆర్థిక నిపుణుడు, నిధుల సమీకరణలో అనుభవం ఉన్న సౌరబ్ హెచ్.బోరాకు బోర్డు సభ్యుడిగా స్థానం దక్కింది. గతంలో ఎంసీఐ చైర్మన్‌గా విధులు నిర్వహించిన కేతన్ దేశాయ్ కుమారుడు డాక్టర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో స్థానం లభించింది. కేతన్‌పై ఆరోపణలుండడంతో ఆయనకు బదులుగా అదిత్ దేశాయ్‌కు అవకాశం కల్పించారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh: ఇండియాస్పోరా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ..
Vidadala Rajini: యూట్యూబ్ ఛానల్స్‌పై మాజీ మంత్రి ఫిర్యాదు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 31 , 2024 | 12:54 PM