ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD EO: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో స్పందన..

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:40 PM

Andhrapradesh: నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని.. నాణ్యతని పెంచాలని సప్లైదారుడిని హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీకీ స్వంతంగా ల్యాబ్ లేదని.. టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చెయ్యలేరని నిపుణులు చెప్పారన్నారు.

TTD EO Shyamala Rao

తిరుమల, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డు (Tirumala Laddu) వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) స్పందించారు. శుక్రవారం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డు నాణ్యత పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నెయ్యిలో నాణ్యత లేని కారణంగానే లడ్డులో నాణ్యత లోపించిందని పోటు కార్మికులు చెప్పారన్నారు. నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని.. నాణ్యతని పెంచాలని సప్లైదారుడిని హెచ్చరించామని చెప్పారు.

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..


నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీకీ స్వంతంగా ల్యాబ్ లేదని.. టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చెయ్యలేరని నిపుణులు చెప్పారన్నారు. తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని టెండర్ దారుడు సప్లై చేశారని తెలిపారు. 319 రూపాయలకే మార్చి 12 ఏఆర్ సంస్థ టెండర్ దక్కించుకొని.. మే 15 తరువాత సప్లై చేశారన్నారు. నెయ్యి నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్‌ల నెయ్యిని వెనక్కి పంపించేశామన్నారు. జూలై 6, 12 వ తేదీన నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపామని.. నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు వివిధ రకాల కల్తీ జరిగినట్లు గుర్తించామని.. త్వరలోనే అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సీరియస్



ల్యాబ్ రిపోర్ట్ ఇదే..

వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలైనట్లైంది. నెయ్యి కొనుగోళ్ళలో ఎటువంటి నాణ్యత పాటించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో తాము ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని చెప్పుకొచ్చిన వైసీపీ నేతల మాటలు అన్నీ అబద్దాలే అని ల్యాబ్ నివేదికతో తేలిపోయింది.


ఇవి కూడా చదవండి..

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 04:31 PM