YCP: ఆరు టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ..
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:24 AM
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించిన ఎమ్మెల్సీపై ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. భక్తుడి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ జరిపారు. భక్తులకు అధిక ధరకు టికెట్లను విక్రయించినట్లు నిర్దారణ కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను (VIP break darshan tickets) బెంగళూరుకు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తికి వైసీపీ (YCP) ప్రజాప్రతినిధి అధిక ధరకు విక్రయించారు. వైసీపీ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లు పొందారు. ఆ ఆరు టిక్కెట్లను రూ. 65 వేలకు భక్తులకు విక్రయించారు. బ్రేక్ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించిన ఎమ్మెల్సీపై భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. భక్తుడి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ జరిపారు. భక్తులకు అధిక ధరకు టికెట్లను విక్రయించినట్లు నిర్దారణ కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అలాగే ఆగస్టులో తిరుమలలో తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి రెండున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరుకు చెందిన కొంత మంది వ్యక్తులు కుప్పం ఎమ్మెల్సీ భరత్‌తో పాటు ఆయన పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆన్ లైన్‌లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశామని వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలు కూడా ఇచ్చారు.
చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ హయాంలో సిఫారసు లేఖల ద్వారా టిక్కెట్లు అమ్ముకోవడం పెద్ద వ్యాపారంగా మారింది. దాన్నే టీడీపీ హయాంలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిచారు. ఎమ్మెల్సీగా తన లేఖలను టిక్కెట్ల అమ్మకానికి వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అనుకున్న విధంగా టిక్కెట్లు దక్కకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భరత్ చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడులు కూడా చేయించారు. ఆ భయంతో ఇప్పుడు ఆయన కుప్పం కూడా పోవడం లేదు. కీలక నేతలంతా కుప్పం నుంచి పరారయ్యారు. ఇప్పుడు గుంటూరులో ఆయనపై కేసు నమోదయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..
20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 20 , 2024 | 10:42 AM