ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీఏసీ ఛైర్మన్ పదవికి వైఎస్పార్‌సీపీ నామినేషన్..

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:05 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి.. ఇంతవరకు అసెంబ్లీకి రాకపోయినా.. పీఏసీ ఛైర్మన్ పదవి కావాలంటూ గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.

అమరావతి: శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు గురువారం ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పీఏసీ ఛైర్మన్ పదవికి (PAC Chairman Post) నామినేషన్ (Nomination) దాఖలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (MLA Peddireddy Ramachandra Reddy) అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చారు. పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్స్ కమిటీ ఎన్నిక ప్రక్రియను నిన్న (బుధవారం) సభలో మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ప్రకటించిన విషయం తెలిసిందే.


కాగా క్యాబినెట్ హోదా కలిగిన పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షపార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీ. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ ఛైర్మన్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనూహ్యంగా పీఏసీ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా తంబాళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ తదితరులు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అసెంబ్లీ సమావేశాలను 11మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బాహిష్కరించారు. ఇప్పుడు పీఏసీ పదవి కావాలంటూ ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.


పీఏసీపై ఉత్కంఠ..

శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు ఈరోజుఎన్నిక జరగనుంది. ఈసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ఆసక్తిగా మారింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీను ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. పీఏసీలో సభ్యుడిగా ఎన్నికకు అవసరమైన కనీస ఓట్లు 18. అయితే ప్రతిపక్షానికి 11 స్థానాలు మాత్రమే కావడం.. వారు అసెంబ్లీకి రాకపోవడంతో పీఏసీపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షం నుంచి కనీసం ఎవరైనా నామినేషన్ వేస్తారా.. లేదా అన్న దానికి తెరతీస్లూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూ సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ దోపిడి..

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన..

మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 01:05 PM