ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CID : వారిపై దయచూపొద్దు

ABN, Publish Date - Dec 01 , 2024 | 04:42 AM

సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది.

  • చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు

  • కాంతి రాణా, విశాల్‌ గున్నీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయండి

  • పీఎస్ఆర్‌ ఆంజనేయులు సూచనతో అమాయక మహిళను కేసులో ఇరికించారు

  • విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొన్నారు

  • పోలీసు శాఖకు అపకీర్తి తెచ్చారు

  • జెత్వానీ కేసులో హైకోర్టులో సీఐడీ కౌంటర్లు

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది. ‘కేసులో ఏ2గా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు సూచనల మేరకు వీరంతా ప్రణాళిక ప్రకారం జెత్వానీని కట్రపూరితంగా కేసులో ఇరికించినట్లు దర్యాప్తులో తేలింది. జెత్వానీని అరెస్ట్‌ చేయాలని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా, విశాల్‌గున్నీలకుపీఎ్‌సఆర్‌ ఆంజనేయులు సూచించారు. కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే ముంబైకి వెళ్లేందుకు వీలుగా కాంతిరాణా దిగువస్థాయి పోలీసులకు విమాన టికెట్లు బుక్‌ చేశారు. పర్యవసానాలు ఆలోచించకుండా పైఅధికారి చెప్పినట్లు ఐపీఎస్‌ అధికారులు నడుచుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అమాయక మహిళను కేసులో ఇరికించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీస్‌ మ్యాన్యువల్‌ ఆర్డర్‌ను ఉల్లంఘించారు. పోలీసు ఉన్నతాధికారులే నేరంలో భాగం కావడం ద్వారా పోలీ్‌స శాఖకు అపకీర్తి తెచ్చారు. ఇలాంటి వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉం ది. కీలక సాక్షులపై ఒత్తిడి చేసి వాస్తవాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. దర్యాప్తు నిరాటంకంగా సాగాల్సి ఉంది.


వాస్తవాలను వెలికితీసి దర్యాప్తు పూర్తి చేసేందుకు పిటిషనర్ల కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరం. ఇలాంటి అధికారులకు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజలు ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం కోల్పోతారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో వీరి విషయంలో దయ చూపవద్దు. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ దశలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయండి’ అని సీఐడీ కోరింది. జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని తదితరులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో సీఐడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్‌పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం తుది విచారణ జరపనుంది.

  • విద్యాసాగర్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు

సినీ నటి జెత్వానీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టును కోరింది. కేసులో మరికొందరు సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పిటిషనర్‌ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వివరించింది. ఇదే కారణంతో దిగువకోర్టు పిటిషనర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిందని పేర్కొంది.

Updated Date - Dec 01 , 2024 | 04:42 AM