ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఇక వాట్సాప్‌ పాలన!

ABN, Publish Date - Dec 11 , 2024 | 04:24 AM

సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని సమర్థవంతమైన పాలన అందిస్తామని, భవిష్యత్‌లో వాట్సాప్‌ వేదికగా పరిపాలన సాగిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

  • పాలనలో మరింతగా టెక్నాలజీ వినియోగం

  • అన్ని ప్రజా సేవలకూ వాట్సాప్‌ వేదిక కావాలి

  • శాఖలవారీ డ్యాష్‌బోర్డుల నిర్వహణ ఆర్టీజీఎస్‌కు

  • జనవరి 1న జనన, మరణాల నమోదుకు పోర్టల్‌

  • మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్లు

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని సమర్థవంతమైన పాలన అందిస్తామని, భవిష్యత్‌లో వాట్సాప్‌ వేదికగా పరిపాలన సాగిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుల ధ్రువీకరణ నుంచి, ఆదాయ ధ్రువీకరణ వరకు.. జనన, మరణాల నమోదు నుంచి ఇతర ప్రజాసేవల వరకూ వాట్సా్‌పను వేదికగా చేసుకునేలా వ్యవస్థలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌టెక్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల వినియోగంతో ప్రజలకు వేగవంతమైన పరిష్కారాలు అందుతాయని చెప్పారు. శాఖల వారీగా రియల్‌టైమ్‌ డ్యాష్‌ బోర్డుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆర్టీజీఎ్‌సకు అప్పగిస్తామని ప్రకటించారు. మరో వెయ్యి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అందుకు అవసరమైన వెయ్యి ఆధార్‌ కిట్ల కొనుగోలుకు రూ.20కోట్లు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారు. జవనరి 1న జనన, మరణాల నమోదుకు కొత్త పోర్టల్‌ను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ల సాయంతో ధ్రువీకరించుకున్నామని గుర్తుచేశారు. భవిష్యత్తులో పంటలకు పట్టే చీడపీడలు, తెగుళ్లు గురించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. అలాగే రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు డ్రోన్లు సహాయపడతాయని చెప్పారు.


  • ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగిన ధర, 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమచేయడం, రవాణా సౌకర్యం, గోనె సంచుల లభ్యతపై 90 శాతానికి పైగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95 శాతం కుటుంబాల జియో ట్యాగింగ్‌ పూర్తిచేశామని అధికారులు సీఎంకు వివరించారు. ట్యాగింగ్‌ సక్రమంగా జరిగిందో.. లేదో.. సరిచూసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.

  • ప్రత్యేక పోర్టల్‌లో భారీ ప్రాజెక్టుల ప్రగతి

రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్‌ను రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో అప్‌డేట్‌ చేయాలని చెప్పారు.

  • జనన-మరణ ధ్రువీకరణ పత్రాలకు కొత్త పోర్టల్‌

రాష్ట్రంలో జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తలెత్తుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా నూతన వెబ్‌ పోర్టల్‌ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టుల్‌ను నిర్వహించాలని సూచించారు.

Updated Date - Dec 11 , 2024 | 04:24 AM