ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: వైసీపీకి తొత్తుగా పనిచేసిన విజయ్.. సీబీఎన్ దెబ్బతో పండిన పాపం!

ABN, Publish Date - Aug 19 , 2024 | 05:35 PM

వైసీపీకి తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి సీఐ వరకూ ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా కూటమి సర్కార్ చేయాల్సిన శాస్తి చేస్తోంది. వైసీపీతో అంటకాగిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఎలా ఉందన్నది రెండు మూడు నెలలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే..

Thumma Vijay Kumar Reddy

అమరావతి: వైసీపీకి (YSR Congress) తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి సీఐ వరకూ ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా కూటమి సర్కార్ చేయాల్సిన శాస్తి చేస్తోంది. వైసీపీతో అంటకాగిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఎలా ఉందన్నది రెండు మూడు నెలలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే.. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి (Thumma Vijay Kumar Reddy) వంతు వచ్చింది. అధికారంలో ఉన్నన్ని రోజులు సమాచార శాఖను సొంత ఎస్టేట్‌లా భావించి రెచ్చిపోయారు. ఐ అండ్ పీఆర్ (I & PR) కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసి ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ప్రవర్తించారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారగానే విజయ్ పాపం పండింది. పదవీకాలంలో ఉండగా విజయ్ కుమార్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వందల కోట్లను నీలి మీడియాకు దోచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.


పాపం పండినట్లే..!

ఓ వైపు వరుస ఫిర్యాదులు, మరోవైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజయ్ కుమార్‌పై సీఎం నారా చంద్రబాబు (CM Nara Chandrababu) విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తుమ్మా చేసిన అక్రమాలపై విచారణ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ప్రభుత్వం నివేదించినది. 1990వ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ రెడ్డి.. 2019 జూన్ 11న కేంద్ర సర్వీసుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారు. క్విడ్ ప్రోకో, నెపోటిజం(సాక్షికి లబ్ది చేకూర్చడం), అవినీతి.. అక్రమాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఒక్క సాక్షి మీడియాకే రూ. 400 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చారు. సాక్షి మీడియా మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి చెందినది కావడంతో భారీగా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విజయ్ కుమార్ రెడ్డిపై నాటి నుంచే ఆరోపణలు వస్తున్నాయ్. 2019 నుంచి 2024 మార్చి వరకు ఆయన హయంలో ఇచ్చిన మీడియా ప్రకటనల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేయనున్నది. ఏపీ డిప్యూటేషన్ ముగియడంతో కలకత్తాలో పీఐబీ డైరెక్టర్ జనరల్‌గా ఈ మధ్యనే విజయ్ జాయిన్ అయ్యారు. తుమ్మాపై విచారణను కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


రెండేళ్లు వద్దు.. రెండ్రోజుల్లో వెళ్లిపోతా!

ఢిల్లీ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన విజయ్.. ప్రభుత్వం మారినా సరే రెండేళ్లపాటు ఇక్కడే ఉంటానని కేంద్రాన్ని అనుమతి కోరారు. అయితే.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని రెండు రోజుల్లో వెళ్లిపోతానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇదంతా జూన్-06న జరిగింది. వైఎస్ జగన్‌ అధికారంలోకి రాగానే 2019 జూన్‌ 10న విజయ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. జూన్-09న ఆయన డిప్యుటేషన్‌ ముగిసింది. అయితే ఆయన డిప్యుటేషన్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతూ ఇటీవలే కేంద్రానికి సీఎస్‌ జవహర్‌ రెడ్డి వినతి కూడా పంపారు. కోడ్‌ ఉన్నందున నాడు సమాధానం రాకపోగా.. ఈలోపు రాష్ట్రంలోని ఓటర్లు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపారు. దీంతో ఉలిక్కిపడ్డ విజయ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయానికి వెళ్లి అందరికీ బై బై చెప్పారు. అనంతరం సీఎస్‌ను కలిసి ‘నాకు డిప్యుటేషన్‌ పొడిగింపు వద్దు.. రెండు రోజుల్లో వెళ్లిపోతా.. రిలీవ్‌ చేయండి’ అని విజయ్ కోరడంపై నాడు పెద్ద రాద్ధాంతమే జరిగింది.

Updated Date - Aug 19 , 2024 | 05:44 PM

Advertising
Advertising
<