ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu : కోరలు పీకండి

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:53 AM

‘విషపు నాగుల కోరలు పీకేయండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఆ బాధ్యత మేం తీసుకుంటాం.

సోషల్‌ సైకోలపై సీఎం నిర్దేశం

డీజీపీ, నిఘా చీఫ్‌లతో సమావేశం

ఉపేక్షిస్తే రాష్ట్రానికే తీవ్ర ముప్పని స్పష్టీకరణ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఊరుకోవద్దని విస్పష్ట ఆదేశాలు

ఇప్పటికే మూలాలు గుర్తించాం.. చర్యలు మొదలయ్యాయి

త్వరలోనే కూకటి వేళ్లతో పెకలిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా యాగీకి వైసీపీ కుట్ర

నిరసనల పేరుతో రచ్చ చేసేలా ప్రణాళిక

సీఎంకు వెల్లడించిన డీజీపీ, నిఘా బాస్‌!

అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘విషపు నాగుల కోరలు పీకేయండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. ఎక్కడా వెనుకడుగు వేయద్దు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే ఏ స్థాయి వ్యక్తులైనా వదిలి పెట్టొద్దని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రతిపక్షం సాగిస్తున్న దుష్ప్రచారం, దానిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్డాలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అరెస్టులు, కౌన్సెలింగ్‌, నోటీసుల దెబ్బకు ‘సోషల్‌ సైకో’లు బెంబేలెత్తుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో... ‘సైకో ఫ్యాక్టరీ’ గుట్టు రట్టు అవుతుండడంతో... రాష్ట్రవ్యాప్తంగా ఏదోఒక రూపంలో అలజడి సృష్టించాలని వైసీపీ ప్రణాళిక రచిస్తున్నట్లు గుర్తించామని చెప్పిన ట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... సోషల్‌ మీడియా ప్రతినిధుల అరెస్టులపై యాగీ సృష్టించేందుకు వైసీపీ సిద్ధమవుతోందని గుర్తించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టయిన, నోటీసులు అందుకున్న కుటుంబాల్లోని మహిళలు, అందులోనూ దళిత మహిళలను రోడ్డెక్కించే పథక రచన చేస్తున్నారని... వారిని రెచ్చగొట్టడం, నిరసనల పేరుతో వంటిపై కిరోసిన్‌ పోసుకునేలా చేయడం వంటి చర్యలకు పురిగొల్పడం, అభిమానులను ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి కుట్రలు అమలు చేసే అవకాశముందని వివరించారు.


వారి పని పడుతున్నాం...

సోషల్‌ మీడియాలో విషం చిమ్ముతున్న వారి పని పడుతున్నామని, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నామని, అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు తెలిపారు. ‘‘ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌గా రూపాంతరం చెందింది. మూలాలు గుర్తించాం. శాఖోపశాఖలుగా విస్తరించిన విషవృక్షాన్ని వీలైనంత త్వరలో కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నాం’’ అని వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కుటుంబాల్లోని మహిళలతోపాటు హోంశాఖ మంత్రిపై అసభ్యకరమైన పోస్టులు సృష్టిస్తున్న తీరు, వాటిని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న వైనం గురించి తెలిపారు. దీనిపై చట్ట పరిధిలో తాము తీసుకుంటు న్న చర్యలను నివేదించారు. ఇలాంటి శక్తులను ఉపేక్షిస్తే రాష్ట్రానికి ముప్పు తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని స్పష్టంగా ఆదేశించారు. దీంతో అవసరమైతే కేంద్ర బలగాలను కూడా రప్పించేందుకు పోలీ సు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 09:11 AM