ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Nov 25 , 2024 | 05:00 PM

సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు.. లబ్దిదారులకు అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు.. రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా మారిందన్న సంగతి అందరికి తెలిసిందే.

అమరావతి, నవంబర్ 25: రాష్ట్రంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందుకోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల్లో.. విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పి్స్తున్నట్లు సమాచారం. సంక్రాంతి లోపు అర్హులను గుర్తించి.. వారికి కార్డులు అందజేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

Also Read: అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం


ఈ నేపథ్యంలో నేడో రేపో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి.. విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే లబ్దిదారులకు మంజూరు చేసే.. కార్డు రంగుతోపాటు దానిపై ముద్రించే చిహ్నాల ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు.

Also Read: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ


చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఆ క్రమంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. డిసెంబర్ 2 వ తేదీ అనంతరం కొత్త రేషన్ కార్డులు జారీకి చర్యలు చేపట్టనుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతోందని తెలుస్తుంది.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయ లేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలు, కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన వారితోపాటు అర్హత గల లబ్దిదారులు సైతం కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.


అర్హులైన వారందరికి తక్షణమే రేషన్ కార్డులు జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందుకోసం మ్యారేజ్ సర్టిఫికేట్‌ ఆధారంగా కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు అందించనుంది.


వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు.. లబ్దిదారులకు అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు.. రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా మారింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అత్యధిక శాతం మంది తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి సర్కార్ మరోసారి వారి వివరాలను పరిశీలించి వారి అనర్హులగా గుర్తించి.. వారి రేషన్ కార్డులను రద్దు చేయనుందని సమాచారం.

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 25 , 2024 | 09:50 PM