Ration Mafia: రేషన్ మాఫియాకు కళ్లెం
ABN, Publish Date - Dec 12 , 2024 | 04:11 AM
రేషన్ మాఫియాను ఈ రోజు నుంచే రూపుమాపాలని, బియ్యం రీసైక్లిం గ్ చేసేందుకు వీల్లేదని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బియ్యం రీసైక్లింగ్ చేసేందుకు వీల్లేదు
సర్వీసూ ఓ ప్రొడక్టే.. సేవారంగానికి ప్రచారం కల్పించండి
వినూత్నంగా ఆలోచిస్తేనే అభివృద్ధి సాధ్యం
ఒక్క వ్యవసాయంతోనే ప్రగతిని సాధించలేం
అదనంగా సేవల రంగాన్ని కూడా పెంచాలి
వారానికి ఒక రోజు క్షేత్ర పర్యటన.. సీఎం సూచన
అమరావతి, డిసెంబర్ 11(ఆంధ్రజ్యోతి): రేషన్ మాఫియాను ఈ రోజు నుంచే రూపుమాపాలని, బియ్యం రీసైక్లిం గ్ చేసేందుకు వీల్లేదని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రేషన్ మాఫియాను నిర్మూలించడంలో ఏమైనా సమస్యలున్నాయా? అనిప్రశ్నించారు. రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని సగంమంది అవసరం లేదని తీసుకోవడం లేద ని, దీనికి సంబంధించి ఏం చేయాలనేది కార్యాచరణను సిద్ధం చేయాల్సి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘పోర్టుకు పోయేలోపు 3 చెక్‌పోస్టులుంటే, వాటన్నింటిని దాటుకుని రేషన్ బియ్యం ఎలా పోర్టులోకి వెళుతోందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. కాకినాడ కలెక్టర్ షన్‌మోహన్‌ను ప్రశ్నించారు. రేషన్ బియ్యంలో ఫైన్ రకం బియ్యం కలిపి ఎగుమతి చేయడం వల్ల దాన్ని కనిపెట్టలేకపోయార ని, 86 మిల్లులకు నోటీసులిచ్చామని కలెక్టరు వివరణ ఇచ్చా రు.
విశాఖపట్నానికి జార్ఖండ్ నుంచి కూడా బియ్యం దిగుమతి అవుతోందని, ఊహించని విధంగా మాఫియా నడుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం ప్రజలు తినకపోవడానికి కారణమేంటని చంద్రబా బు అడగగా... మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ‘‘అన్నం ముద్దగా ఉండటంతో తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దానివల్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు అవకాశం ఏర్పడుతోంది’’ అని వివరించారు. బియ్యం స్థానంలో తృణధాన్యాలు ఇవ్వాలని, రైతులకు ఎంఎ్‌సపీ రేట్లు పెంచి ఇవ్వడం ద్వారా.. మేలు రకం వరి పండించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 24 గంటల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి జరిగిన తర్వాత కూడా చెల్లింపులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. దేవదాయ భూము ల్లో కూడా మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనం పెంచాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
వారానికి ఒకరోజు..
కలెక్టర్లు వారానికి ఒక రోజు క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఆరునెలలు అయిన నేపథ్యంలో తాను క్షేత్రస్థా యి పర్యటనలు చేసి.. పనితీరులో ఉన్న తప్పులను పరిశీలిస్తానని వెల్లడించారు. మీటింగులన్నింటినీ సులభతరం చేశామనీ, గతంలోలా పరదాలు కట్టి, చెట్లు నరకాల్సిన అవసరం లేదన్నారు.
Updated Date - Dec 12 , 2024 | 04:19 AM