ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెరగాలి: సీఎం

ABN, Publish Date - Dec 04 , 2024 | 05:39 AM

‘రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నేర నియంత్రణ, భద్రతా చర్యల్లో డ్రోన్ల వినియోగం పెంచాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నేర నియంత్రణ, భద్రతా చర్యల్లో డ్రోన్ల వినియోగం పెంచాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బెంగళూరుకు చెందిన ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన మల్టీపర్పస్‌ డ్రోన్లను మంగళవారం రాత్రి అమరావతి సచివాలయంలో సీఎం ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘అన్ని ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగం విస్తృతం చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్లుతో మందుల సరఫరా చేయాలి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు, దోమల నియంత్రణకు మందుల పిచికారికి డ్రోన్లను వాడాలి. అడవుల్లో కార్చిచ్చు లాంటి ప్రమాదాలను డ్రోన్లతో పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ కార్యదర్శి సురేష్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 05:39 AM