ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: అన్నా క్యాంటీన్ శాశ్వతంగా కొనసాగించాలి.. ఇదే నా ఆకాంక్ష

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:35 PM

Andhrapradesh: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్ట కోసమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు గుడివాడ మునిసిపల్ పార్క్‌లో సీఎం ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరైనా కడుపునిండా తినాలని ఆశిస్తామన్నారు. గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని.. ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటైన మహిళగా గుర్తుపెట్టుకున్నామని చెప్పారు.

CM Chandrababu Naidu

గుడివాడ, ఆగస్టు 15: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్ట కోసమే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) అన్నారు. గురువారం నాడు గుడివాడ మున్సిపల్ పార్క్‌లో సీఎం.. ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరైనా కడుపునిండా తినాలని ఆశిస్తామన్నారు. గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని.. ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటైన మహిళగా గుర్తుపెట్టుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక.. తిరుమలలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు


గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను రద్దు చేసిందన్నారు. ‘‘మీ పేరు పెట్టుకుని అన్నం పెట్టండని అడిగా.. మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం’’ అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్‌ నెలాఖరులోగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదవాళ్లను తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని అన్నారు. హరేకృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని నా ఆకాంక్ష’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!


కాగా... గుడివాడ మునిసిపల్ పార్క్‌లో సీఎం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆపై చంద్రబాబు దంపతులు సైతం టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5 లకే ఆహారాన్ని అందిస్తారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది? అని పేద ప్రజల్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని


రూ.5 లకే కడుపు నింపే అన్న క్యాంటీన్లు పున: ప్రారంభం మహోన్నత కార్యక్రమానికి నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళం అందించారు. అందుకు సంబంధించిన చెక్‌ను మున్సిపల్ శాఖ మంత్రి పీ.నారాయణకు అందజేశారు. కోటి రూపాయల విరాళం అందించిన వారి పేరు మీద ఒక రోజు ఆహారం అందిస్తామని ఇంతకు ముందు మంత్రి నారాయణ పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లోని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం త్వరలోనే అమలు చేస్తామని నారాయణ తెలిపారు. కాగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ రోజు ప్రారంభమయ్యాయి.


ఇవి కూడా చదవండి...

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు? దీని ఉద్దేశ్యం ఏమిటంటే..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 03:43 PM

Advertising
Advertising
<