ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

ABN, Publish Date - Jul 23 , 2024 | 02:37 PM

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

అమరావతి, జులై 23: రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఐదేళ్లు మూడు రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం నెట్టుకొచ్చిందన్నారు. దీంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు.


టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచారన్నారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాస్ అనే వారని.. కానీ తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్ అనేలా చేసిన ఘనత మాత్రం ఎన్టీఆర్‌దేనని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పటాయిందని తెలిపారు. వికసిత భారత్ వైపు భారత్ అడుగులు వేస్తుందన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే తొలి స్థానం లేదా రెండో స్థానంలో ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 02:37 PM

Advertising
Advertising
<