ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం.. 20 లక్షల ఇళ్లు నిర్మించాం..

ABN, Publish Date - Feb 23 , 2024 | 01:56 PM

రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటింటికీ అందించామని సీఎం జగన్ వెల్లడించారు. నేడు ఆయన ఒంగోలు బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రకాశం : రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటింటికీ అందించామని సీఎం జగన్ (CM Jagan) వెల్లడించారు. నేడు ఆయన ఒంగోలు (Ongole) బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని (Naminated Posts) చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పది సంవత్సరాల తరువాత అమ్ముకునే హక్కు లబ్దిదారులకు లభిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన అవరోధాలు దాటుకుని పని చేస్తున్నామని జగన్ అన్నారు. ప్రైవేటు లే లేఔట్‌లకి ధీటుగా ఊళ్లు నిర్మిస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతోందన్నారు. అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నామన్నారు.

1191 కేసులు వేశారు..

రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లు ఇళ్ళ కోసం ఖర్చు చేస్తున్నామని జగన్ అన్నారు. చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు (Chandrababu) ఆయన మనుషులు 1191 కేసులు వేశారన్నారు. పెత్తందారి బాబు పేదలకు ఇచ్చింది కన్నీళ్లేనన్నారు. ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామన్నారు. ఒంగోలులో ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టులో కేసు వేశాడన్నారు. రూ.334 కోట్లతో ఒంగోలులో రోజూ తాగు నీరు అందించేందుకు శంఖుస్థాపన చేశామన్నారు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నారని జగన్ అన్నారు.

అబద్ధపు కథనాలు రాస్తున్నారు..

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబు వాదించాడు. చంద్రబాబు రాజకీయాల్లో పాపిష్టి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు స్టేట్ మెంట్ ఇచ్చాడు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మాయ చేశాడు. రంగురంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5ల్లో అబద్దపు కథనాలు రాస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా లేదు. చంద్రబాబు లాంటి వ్యక్తులతో రాజకీయాలు భ్రష్టుపట్టాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 01:56 PM

Advertising
Advertising