ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఘోరంగా అవమానించిన సీఎం జగన్

ABN, Publish Date - Mar 06 , 2024 | 02:42 PM

సీఎం జగన్ సభలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఘోర అవమానం జరిగింది. ఆదిమూలపు సురేష్‌తోపాటు ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు అవమానం ఎదురైంది.

ప్రకాశం: సీఎం జగన్(CM Jagan) సభలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌కు(Adimulapu Suresh) ఘోర అవమానం జరిగింది. ఆదిమూలపు సురేష్‌తోపాటు ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు కూడా అవమానం ఎదురైంది. వారిద్దరిని అవమానించింది స్వయంగా సీఎం జగనే కావడం గమనార్హం. బుధవారం వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం జగన్ సభ నిర్వహించారు. ఈ సభలో వేదికపై ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్, తాటిపర్తి చంద్రశేఖర్‌ను సీఎం జగన్ కిందకు పంపించారు. సీట్లలో కూర్చున్న వారిని లేపి మరి నిలబెట్టిన జగన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా వారి సీట్లలో రాజ్యసభ సభ్యులు వైవి. సుబ్బారెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్ వెంకాయమ్మని కూర్చొబెట్టారు. దీంతో జగన్ ప్రసంగం సాగినంత సేపు మంత్రి సురేష్, చంద్రశేఖర్ నిలబడే ఉన్నారు. కార్యక్రమం జరుగుతున్నది మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజక వర్గంలో అయినప్పటికీ సభా వేదికపై ఆయనకు చోటు లభించకపోవడం గమనార్హం. దీంతో సీఎం జగన్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 02:46 PM

Advertising
Advertising