ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Journalist: మీడియాపై దాడి సిగ్గు సిగ్గు.. ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళన

ABN, Publish Date - Feb 19 , 2024 | 12:34 PM

Andhrapradesh: అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ రౌడీ మూక దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళలు చేపట్టారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఎదుట బైఠాయించి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 19: అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ రౌడీ మూక దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళలు చేపట్టారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఎదుట బైఠాయించి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని అరెస్ట చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు...

  • తిరుపతి: రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసనగా తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రెస్‌క్లబ్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని పార్టీల నేతలు నిరసనలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగుతోంది.

  • అనంతపురం: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రౌడీ మూఖలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని.. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • నెల్లూరు: రాప్తాడులో జరిగిన సీఎం జగన్ సభలో ఏబీఎన్ అంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి, హత్యాయత్నాన్ని జర్నలిస్టు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రంగా ఖండించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రమేశ్ ధర్నాలో పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ సీఎం సభలో జర్నలిస్టులపై దాడి సంఘటనలు జరగలేదని... రాప్తాడు సంఘటనలో నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ హెచ్చరించారు.

    • వెంకటగిరి గ్రంధాలయం గాంధీ విగ్రహం వద్ద విలేకరులు నిరసన చేపట్టారు. రాప్తాడులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా కార్యదర్శి జోసెఫ్ ఖండించారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన విలేకరిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో గాంధీ విగ్రహానికి విలేకరులు వినతిపత్రం అందించారు.

  • కర్నూలు: రాప్తాడు సిద్ధం సభలో అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ మూకల దాడిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. నిరసన కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, సీపీఐ సీపీఎం నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    • ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో జర్నలిస్ట్ సంఘం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తా రోకో నిర్వహించారు. జర్నలిస్టులు, టీడీపీ నాయకులు, సీపీఎం, సీపీఐ ఎమ్‌ఎల్, ఐఎఫ్‌టీయూ, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు.

  • శ్రీ సత్య సాయి జిల్లా: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ దాడిని ఖండిస్తూ ధర్మవరం ప్రెస్‌క్లబ్, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని ధర్మవరం కాలేజ్ సర్కిల్ వద్ద నుంచి కళాజ్యోతి సర్కిల్ డి.ఎస్.పి కార్యాలయం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వైసీపీ గుండాలను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. నిరసన ర్యాలీలో జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు పాల్గొన్నారు. వన్‌టౌన్ సీఐ తోటి సుబ్రహ్మణ్యంకు జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించారు.

    • అలాగే జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ ఎస్పీ మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కృష్ణపై దాడి అమానుషమని.. సిగ్గుమాలిన పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదని, జర్నలిస్టులపై దాడులు పునరావతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు.


  • చిత్తూరు: అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ దాడిని నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద పార్టీలకతీతంగా ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పత్రిక స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాల రాసిందంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    • అటు చిత్తూరు కలెక్టరేట్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

  • పల్నాడు జిల్లా: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా చిలకలూరిపేట విలేకరులు నిరసనకు దిగారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపై విలేకరులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం చిలకలూరిపేట తహశీల్దారు‌కు వినతిపత్రం అందజేశారు.

  • బాపట్ల: రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ పై జరిగిన దాడిని ఖండిస్తూ చీరాలలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చీరాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • విజయవాడ: రాప్తాడు ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై దాడి దుర్మార్గమని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ కమిటీ మండిపడింది. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని.. దుండగులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 19 , 2024 | 12:50 PM

Advertising
Advertising