Margadarshi Case: సుప్రీంలో మార్గదర్శి కేసుల బదిలీపై విచారణ ముగింపు.. కోర్టు సూచనలివే..
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:34 PM
Andhrapradesh: మార్గదర్శి కేసుల బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మార్గదర్శికి సుప్రీం ధర్మాసనం సూచించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మార్గదర్శి కేసుల (Margadarsi Case) బదిలీపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ (AP Government) అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో (AP HighCourt) పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మార్గదర్శికి సుప్రీం ధర్మాసనం సూచించింది. మార్గదర్శిపై దాఖలైన చార్జిషీట్‌లను రెండు జిల్లా కోర్టులు తిరస్కరించిన కేసులో హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్స్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్స్‌పై విచారణను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు(Telangana HighCourt) బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో మార్గదర్శి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణకు రాగా... జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతున్నందున స్టే ఇవ్వాలని కోరవచ్చని సుప్రీం ధర్మాసనం చెప్పింది. తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసే వరకు ఏపీ ప్రభుత్వ అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ మార్గదర్శి దాఖలు చేసిన ట్రాన్సఫర్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 02 , 2024 | 12:54 PM