ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Confusion : సర్దుబాటులో గందరగోళం

ABN, Publish Date - Sep 11 , 2024 | 10:46 PM

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సర్దుబాటు చేపట్టింది. విద్యాశాఖాధికారుల నిర్వాకంతో సర్దుబాటు పక్రియ గందరగోళంగా తయారైంది. దీంతో విద్యాశాఖాధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోడంపల్లె మున్సిపల్‌ ఉర్ధూ పాఠశాలలో విద్యార్థులు

ఎంత చేసినా ఉపాధ్యాయుల కొరతే

జూనియర్లకు ప్రాధాన్యత

విద్యాశాఖ అధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 11: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సర్దుబాటు చేపట్టింది. విద్యాశాఖాధికారుల నిర్వాకంతో సర్దుబాటు పక్రియ గందరగోళంగా తయారైంది. దీంతో విద్యాశాఖాధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 110 ప్రభుత్వ పాఠశాలల్లో 14,320 మంది విద్యార్థులు, దాదాపు 525 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆగస్టు 19న మండల, డివిజన్‌స్థాయిలో పనిసర్దుబాటు చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాలు, నోరున్న ఉపాధ్యాయుల మాటే చెల్లుబాటు కావడంతో కొందరు ఉపాధ్యాయులు అనుకున్న పాఠశాలలకు వెళ్లారు. పని సర్దుబాటు జరిగినా దొరసానిపల్లె జడ్పీ హైస్కూలులో ఇద్దరు, మరో జడ్పీ హైస్కూలులో ఒకరు, ఎస్పీజీ బాయిస్‌ హైస్కూలులో ముగ్గురు ఉపాధ్యాయుల కొరత ఉంది. మోడంపల్లె మున్సిపల్‌ ఉరూ పాఠశాలలో ఇద్దరు, హోమస్‌ పేట, శ్రీనివాసనగర్‌, చౌటపల్లె, మీనాపురం, రాజీవ్‌నగర్‌, రేగుళ్లపల్లె, తాళ్లమాపురం హరిజనవాడ, ఉప్పరపల్లె, బొజ్జవారిపల్లె, ఈశ్వర్‌రెడ్డినగర్‌, చెన్నంరాజుపల్లె ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క ఉపాధ్యాయుల కొరత ఉండగా గోపవరం, ఖాదర్‌బాద్‌ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఒక్కో పాఠశాలలో ముగ్గురు వంతున ఉపాధ్యాయుల కొరత ఉంది.


మొత్తం మీద ఉన్నత పాఠశాలలో 6, ప్రాథమిక పాఠశాలలో 19 మంది ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యాశాఖాధికారులు సీనియర్‌ అధికారులను పక్కనబెట్టి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సీనియర్లు నష్టపోయారు. యూడైస్‌, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను పనిసర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల కోసం డ్రాపౌట్స్‌ విద్యార్థులను పాఠశాలలో నమోదు చేశారు. దీంతో ఆ పాఠశాలలకు అదనంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఫలితంగా మండలంలో 25 మంది ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. సర్దుబాటుతో ఉపాధ్యాయులకు శ్రమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. పదోన్నతులు ఇవ్వకుండా సర్దుబాటు చేయడం వలన పాఠశాలలకు కూడా ఉపయోగం లేదని పెదవి విరుస్తున్నారు.

అస్తవ్యస్తం

మండలంలో చేపట్టిన సర్దుబాటు అస్తవ్యస్తంగా మారింది. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులున్నా కొన్ని పాఠశాలలకు కేటాయించలేదు. సర్దుబాటుతో పాఠశాలలకు ఉపయోగంలేదు. సర్దుబాటుపై అధికారుల తప్పులను ప్రశ్నిస్తే అన్‌లైన్‌ పేరుతో తప్పించుకుంటున్నారు.

సుబ్బరాజు యాదవ్‌, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - Sep 11 , 2024 | 10:46 PM

Advertising
Advertising