ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెకీతో విద్యుత్తు ఒప్పందాలు రద్దు చేయాలి: సీపీఐ

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:55 AM

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ద్వారా 7వేల మెగావాట్ల అంతర్‌రాష్ట్ర సౌర విద్యుత్తు కొనుగోలుకు గత జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను...

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ద్వారా 7వేల మెగావాట్ల అంతర్‌రాష్ట్ర సౌర విద్యుత్తు కొనుగోలుకు గత జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే మార్గాన్ని అన్వేషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం ఆయన లేఖ రాశారు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల విద్యుత్తు సంస్థలు రూ.49,566 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో విద్యుత్తు వినియోగదారులపై రూ.32,166 కోట్ల భారం పడిందని వివరించారు. సెకీ ద్వారా 7వేల మెగా వాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రంపై ఏటా రూ.3,850 కోట్ల నుంచి రూ. 4,350 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కనుక ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 15 , 2024 | 04:55 AM