AP: తుఫాన్ గండం.. ఆ ప్రాంత వాసులకు బిగ్ అలర్ట్
ABN, Publish Date - Nov 27 , 2024 | 06:24 PM
ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది.
విశాఖపట్నం: ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదని అలర్ట్ చేసింది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది.
గడచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 120 కిమీ, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 370 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 470 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
Updated Date - Nov 27 , 2024 | 06:58 PM