ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan : మరో పదేళ్లు చంద్రబాబే సీఎం

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:42 AM

మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్‌ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఐదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు ఏపీ ఎకానమీ

ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది

ప్రచార యావ కోసం పాస్‌ పుస్తకాలపైౖనా బొమ్మలు

జగన్‌ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

చంద్రబాబు విజన్‌తో తిరిగి నమ్మకం ఏర్పడింది

ఆయన ఆదేశాల మేరకు మేం పనిచేస్తాం

అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై చర్చ

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్‌ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రం ఈ మైలురాయి చేరుతుందని చెప్పానని, అయితే, విధ్వంసానికి గురైన ఏపీలో అది సాధ్యంకాదేమోనని అనుకున్నానని చెప్పారు. కానీ.. సీఎం చంద్రబాబు విజన్‌, ఆయన పాలనానుభవం చూశాక ఐదేళ్లలో 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. 150 రోజుల పాలనపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘గంజాయి రవాణా, ఇసుక దోపిడీ, పంచాయతీల నిర్వీర్యం, దేవుడి విగ్రహాల కూల్చివేతలు లాంటివి మాత్రమే గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది. దేశంలో తెలుగువారు ముందుండడానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టారు. సొంత ప్రచారానికి భూముల పాస్‌పుస్తకాలను కూడా వదలకుండా మాజీ సీఎం బొమ్మలు వేసుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా నేను డాక్టర్‌ ‘యల్లాప్రగడ సుబ్బారావు’ పేరును ప్రస్తావించగానే సీఎం చంద్రబాబు ఓ కాలేజీకి ఆయన పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ పేరును ప్రస్తావించగానే.. చిన్నారుల మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. పథకాలకు స్వాతంత్ర సమరయోధులు, త్యాగాలు చేసినవారి పేర్లు పెట్టాలి. కానీ, గత ప్రభుత్వంలో జగన్‌ ప్రచార యావతో తన పేర్లు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన రోజును రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోబోతున్నాం. కన్యకాపరమేశ్వరి బలిదానం చేసిన రోజును కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.


కూటమి వచ్చాకే సకాలంలో జీతాలు

గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడూ 1న జీతాలు రాలేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో జీతాలు అందుతున్నాయని చెప్పారు. 13,326 గ్రామ పంచాయతీలకు పల్లె పండగ కింద రూ.4500 కోట్లు విడుదల చేశామన్నారు. ‘జల్‌జీవన్‌ మిషన్‌’లో ఏపీని నంబర్‌వన్‌ చేస్తామని సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. సంక్షోభాలు, విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని పవన్‌ సూచించారు. విజయవాడ వరదల సమయంలో బురదలో దిగి పనిచేశారని గుర్తు చేశారు. ‘‘కావాలంటే చంద్రబాబు కమాండ్‌ సెంటర్‌లో కూర్చుని పనులు చేయించవచ్చు. కానీ, ఆయనే స్వయంగా వెళ్లి వరదలో పర్యటించి బాధితులకు ఉపశమనం కల్పించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఏకంగా ముగ్గురు ఐపీఎ్‌సలను సస్పెండ్‌ చేసిన ఘనత బాబుకే దక్కుతుంది. సోషల్‌ మీడియాలో మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడే సంస్కృతి ఏర్పడింది. సీఎంను సోషల్‌ మీడియాలో తిట్టినట్లుగానే గ్రామాల్లో మహిళలను బూతులు తిడుతున్నారు. అలాంటి వారిపై సీఎం, హోంమంత్రి ఉక్కుపాదం మోపారు’’ అని పవన్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలంటే మరో దశాబ్దం పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

నాకంటే పవనే గట్టిగా ఉన్నారు: చంద్రబాబు

ఉపముఖ్యమంత్రి స్పందనకు సీఎం చంద్రబాబు ప్రతిస్పందిస్తూ.. ‘‘సోషల్‌ మీడియా, గంజాయి అంశాల్లో నా కంటే పవన్‌ కల్యాణే గట్టిగా ఉన్నారు. నేరాల విషయంలో రాజీలేదు. సోషల్‌ మీడియా పేరుతో మహిళల్ని కించపరిస్తే వారికి అదే చివరి రోజు. ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో మాపై ఎలాంటి కామెంట్లు పెట్టారోనని చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టం. రౌడీలను రాష్ట్రంలో లేకుండా చేస్తాం. బ్లేడ్‌ బ్యాచ్‌ జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు ఎవరూ శాంతిభద్రతలను చేతిలోకి తీసుకోవద్దు. అది ప్రభుత్వ బాధ్యత’’ అని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్‌ అని, రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేస్తుందన్నారు.


జగన్‌ ఇంటి కంచె.. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా!

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచె ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ మాదిరిగా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కూడా జగన్‌ ఇంటికి ఏర్పాటు చేసుకున్నంత స్థాయిలో భారీఎత్తున కంచెలు ఉండవని తెలిపారు. అదే సీఎం చంద్రబాబు ఇంటివద్ద సెక్యూరిటీగా కేవలం రెండు పుల్లలు లాంటివి ఉంటాయన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వారికి ఈ ప్రభుత్వంలో ఇంకా ‘తగిన న్యాయం’ జరగలేదని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచకాన్ని అణచివేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 05:42 AM