ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devineni Uma: నన్ను జైల్లో పెడతానన్నోళ్లు ఏమయ్యారు?

ABN, Publish Date - Feb 23 , 2024 | 10:40 AM

మైలవరం దేవుడు చెరువులో శంఖారావం, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు దేవినేని ఉమ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు.

విజయవాడ: మైలవరం దేవుడు చెరువులో శంఖారావం, బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టో (Menifesto)పై ప్రజలకు దేవినేని ఉమ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు. దేవుడి చెరువులో స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేదలకు 3 సెంట్లు స్థలం ఇచ్చారని దేవినేని ఉమ అన్నారు.

తాను రెండు సెంట్లు ఇస్తే ఈ వైసీపీ (YCP) దుర్మార్గులు నాశనం చేశారన్నారు. నేడు ఈ కాలనీలో కనీసం మంచినీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని దేవినేని ఉమ అన్నారు. పారిశుద్ధ్యం లేమితో పాటు కృష్ణా వాటర్ పైపులైన్‌లో మురికి నీళ్లు వస్తున్నాయన్నారు. ఇబ్రహీంపట్నంను ‘బూడిద పట్నం’ చేశారన్నారు. ఆ బూడిదే మనం తాగే నీళ్లలో వస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) రాగానే మళ్లీ ఆ రెండు సెంట్లను పేదలకిచ్చి పూరగుట్టను మరో పట్టణంగా మైలవరం ప్రజలు గర్వపడే విధంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ - జనసేన (Janasena) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Updated Date - Feb 23 , 2024 | 10:40 AM

Advertising
Advertising