YCP: శింగనమల వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ABN, Publish Date - Feb 02 , 2024 | 01:45 PM
శింగనమల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియామకంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, నార్పల సత్యనారాయణ రెడ్డి, వైసీపీ కీలక నేతలు రాజన్న, మిద్దె కుళ్లయప్ప, గోకుల్ రెడ్డి తదితరులు అసమ్మతి వర్గంగా ఏర్పడి సమావేశమయ్యారు.
అనంతపురం: శింగనమల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియామకంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, నార్పల సత్యనారాయణ రెడ్డి, వైసీపీ కీలక నేతలు రాజన్న, మిద్దె కుళ్లయప్ప, గోకుల్ రెడ్డి తదితరులు అసమ్మతి వర్గంగా ఏర్పడి సమావేశమయ్యారు. శింగనమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని తీర్మానించారు.
నియోజకవర్గ సమన్వయకర్తగా మీ కుటుంబంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై అసమ్మతి వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ కార్యకర్తల గుండెల్లో గుణపం దింపారంటూ అసమ్మతి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పద్మావతి, ఆలూరు సాంబశివరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. మీ ఇంట్లో పని చేసే వీరాంజనేయులును సమన్వయకర్తగా నియమించుకుంటారా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్త వ్యక్తిని నియమిస్తేనే పార్టీకి పనిచేస్తామని... లేకుంటే తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేతల సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ బోరున విలపించారు. ఈ సారి తమ నియోజకవర్గంలో వైసీపీ గెలవదని.. టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ ఇంట్లో పడుకున్నా గెలుస్తారంటూ జోరుగా నియోజకవర్గంలో చర్చ సాగుతోంది
Updated Date - Feb 02 , 2024 | 01:45 PM