CM Relief Fund : పరిమళిస్తున్న దాతృత్వం
ABN, Publish Date - Sep 13 , 2024 | 05:08 AM
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు.
రెడ్డి ల్యాబ్స్ 5 కోట్లు, ఆంధ్ర షుగర్స్ 2 కోట్లు
సీఎం చంద్రబాబుకు చెక్కుల అందజేత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు. విరాళాలిచ్చిన దాతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణరెడ్డి రూ.5 కోట్లు, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తరఫున పెండ్యాల అచ్యుత రామయ్య రూ.2 కోట్లు, పర్చూరు నియోజకవర్గానికి చెందిన విక్రం నారాయణరావు కుటుంబం రూ.1,55,55,555, వసుధా ఫార్మా వెంకటరాజు రూ.కోటి, ఏపీ క్రెడాయ్ తరఫున వైవీ రామారావు రూ.50 లక్షలు, వెంకట్ అక్కినేని రూ.50 లక్షలు, శివశక్తి బయోటెక్ చైర్మన్ నందిగామ శ్రీనివాసరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.50 లక్షలు, మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమం రూ.25 లక్షలు, కోనేరు విమలాదేవి రూ.25 లక్షలు, కోనేరు ప్రదీప్ రూ.25 లక్షలు, ఆర్కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రూ.20 లక్షలు, ఫ్రాంక్విన్ ఫార్ములేషన్స్ సాగి కృష్ణంరాజు రూ.15 లక్షలు, మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ద్వారా ది కాంట్రాక్ట్ క్యారేజీ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.15 లక్షలు, అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణుల నుంచి తంబళ్లపల్లి ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి రూ.15 లక్షలు, సింహ మోటార్స్ రావెళ్ల సతీష్ రూ.10,00,116, బొబ్బా గోపాలకృష్ణ, పువ్వాడ సుధాకర్‌రావు, వాస్తవ్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ రూ.10 లక్షలు, వికాస్ పబ్లిక్ స్కూల్ రూ.5 లక్షలు, విశ్వం ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీ రష్ హెల్త్‌కేర్, కోగంటి వెంకటరామయ్య, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ఐదేసి లక్షలు, వాసిరెడ్డి సుగుణకుమారి రూ.3 లక్షలు, దళవాయి వడ్డే సిమెంట్ పుల్లన్న రూ.2 లక్షలు, ఎన్టీఆర్ కుటీరం తరఫున ఆర్ శివాజీ రూ.లక్ష చెక్కులు అందజేశారు.
లోకేశ్‌కు అందిన విరాళాలు
మంత్రి లోకేశ్‌ను కలసి పలువురు దాతలు విరాళాల చెక్కులు అందజేశారు. విజయవాడకు చెందిన ప్రియ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్థ అధినేత పీ శివకుమార్ రూ.10 లక్షలు, పలమనేరుకు చెందిన బీ సునీల్ రూ.10 లక్షలు, కాకినాడ సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ కాడ వెంకట రమణ రూ.5 లక్షలు, మంగళగిరి వైసీపీ నేత, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, బద్వేలుకు చెందిన చెరుకూరి రవికుమార్, కడపకు చెందిన తేరకండ్ల కృష్ణారెడ్డి, కురుపాంకు చెందిన వైరిచర్ల విరేష్ చంద్రదేవ్, విశాఖ ఐవీవై ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ అధినేత బీ రామ్‌కుమార్ రూ. ఐదేసి లక్షలు, తిరుపతికి చెందిన శ్రీగీతాంజలి ఇంగ్లీష్ మీడియా స్కూల్ యజమాని ఎన్ మాధవి రూ.2 లక్షలు, కందుకూరు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.లక్షన్నర, చింతలపూడికి చెందిన మద్దిపూడి శ్రీనివాసరావు చౌదరి రూ.1,35,136, తిరుపతి సప్తగిరి బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ రూ.1,16,700 విజయవాడకు చెందిన బొర్రా రాధాకృష్ణ రూ.లక్ష, అమలాపురానికి చెందిన మెట్ల రమణబాబు రూ.లక్ష అందజేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్ల విలువ చేసే 10,000 నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపించినట్టు అక్షయపాత్ర ఫౌండేషన్ ఏపీ సెంట్రల్ రీజియన్ అధ్యక్షుడు వంశీధర దాస తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు 22 లక్షలు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.22 లక్షల చెక్కును ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు బుధవారం సీఎంకు అం దించారు. మంత్రి టీజీ భరత్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలసి సీఎంకు చెక్కును అందించారు.
ఏఎంఆర్ కోటి విరాళం
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్ధం ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్ ఎ.మహేష్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మహేశ్వరరెడ్డి, రూ.కోటి చెక్కును అందజేశారు.
తణుకు, సెప్టెంబరు 12: వరద బాధితుల సహాయార్థం ఆంధ్రా షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుత రామయ్య సీఎం సహాయ నిధికి రూ.2కోట్ల విరాళాన్ని అందజేశారు.
Updated Date - Sep 13 , 2024 | 05:08 AM