AP News: మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు: వైఎస్ వివేకా కుమార్తె సునీత
ABN, Publish Date - Mar 15 , 2024 | 03:47 PM
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యలు చేసింది. ‘‘ మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి వివేకాకి జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదని, నిందితులకు శిక్షపడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.
కడప: మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యలు చేసింది. ‘‘ మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి వివేకాకి జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదని, నిందితులకు శిక్షపడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ‘‘ఐదేళ్ళైనా ట్రైల్ మొదలు పెట్ట లేదు. ఇలానే వదిలేస్తే కేసు విచారణ పదేళ్లు పడుతుంది. తప్పుచేసిన వారికి బుద్దిచెప్పాలంటే ఓటు అనే అస్త్రాన్ని వాడాలి.
మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు. నాకు ప్రజాకోర్టులో తీర్పు కావాలి. అది చూసైనా జ్యూడీషియరీలో నాకు న్యాయం జరగవచ్చు. నేను ఏ పార్టీ నుంచి నిలబడతానో లేదో అన్నది ముఖ్యం కాదు. న్యాయం కోసమే నేను పోరాడుతున్నాను. షర్మిల నాకు అండగా ఉంటానన్నారు’’ అని వైఎస్ సునీత అన్నారు. కాగా కడపలో జరిగిన స్మారక సభలో వైఎస్ సునీతతో పాటు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
TDP: నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో
AP News: వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటున్న నేతలు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 04:09 PM