Pawan Kalyan: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..
ABN, Publish Date - Nov 14 , 2024 | 05:59 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కె. రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, నవంబర్ 14: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే ఎవ్వరినైనా బలి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని చెప్పారు.
Also Read: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన
ఆ క్రమంలో సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తామకు ఆవేదన కలిగిందని చెప్పారు.
Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు.
Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
కర్మ ఎవ్వరిని వదలదు... మీ నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమన్న వారు ఇప్పుడు సభకు రాలేక పోయారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను పరోక్షంగా విమర్శించారు. ప్రస్తుతం మమ్మల్ని ఎదుర్కొవాలంటే వారికి భయం కలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబును సైతం ఇబ్బందులు పాలు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను సైతం ఎంతో ఆవేదన చెందానని చెప్పారు.
ఆ క్రమంలోనే నాడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని తాము బయటకు వచ్చామని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా కాశామని చెప్పారు. అయితే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను కోల్పోకోండి.. అదే సమయంలో ప్రజాస్వామ్యం విలువను సైతం కాపాడాలన్నారు. చట్టసభలలో హుందాతనం పోవడం మూలంగానే మీ ఇళ్లల్లోకి వచ్చి మీ వాళ్లను తిడతాం.. రేపులు చేస్తామన్న వ్యాఖ్యలకు ఆజ్యం పడిందన్నారు.
సోషల్ మీడియాలో జరగుతున్న అపసవ్య విధానాలను ఈ సభ ద్వారా సరి చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా అబ్యూస్ ప్రోటెక్షన్ బిల్లు సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హోంమంత్రినే కాదు.. ఇంట్లోని ఆడవాళ్లను సైతం వదలడం లేదు.. ఒక శాడిస్టిగ్‌గా తయారయ్యారన్నారు. మార్పు తెస్తామని ప్రజలు మనపై అపారమైన నమ్మకముంచారని తెలిపారు. మీరు మీ హస్యాన్ని కోల్పోవద్దన్నారు. అదే సమయంలో విలువలను నెలకొల్పుతారని తాను ఆశిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Nov 14 , 2024 | 07:05 PM