ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : కలెక్టర్‌ గారి కాలజ్ఞానం!

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:23 AM

కాలం కంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి పనిచేసే కలెక్టర్లే కాదు... ‘కాలజ్ఞానం’ తెలిసిన కలెక్టర్లు కూడా ఉన్నారండోయ్‌..! పై నుంచి ఏ ఆదేశాలు వస్తాయో మూడు రోజులు ముందే ఊహించి అందుకనుగుణంగా పనిచేసేస్తారు..!

  • ఇసుక అక్రమాలు తవ్వేకొద్దీ లీలలు వెలుగులోకి

  • రీచ్‌లు తనిఖీ చేయాలని ఫిబ్రవరి 5న ఎన్జీటీ ఆదేశం

  • ఫిబ్రవరి 2వ తేదీనే తనిఖీ చేసినట్లుగా నాటి తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డి నివేదిక

  • ఎన్జీటీ ఆదేశాలను ముందుగానే ఎలా ఊహించారో?

  • ఆ తర్వాత తనిఖీలకు వెళ్లకుండానే నివేదిక

  • డ్రెడ్జింగ్‌ ఇంటర్నల్‌ మ్యాటరంటూ తేల్చేసే యత్నం

  • అక్రమ తవ్వకాలే లేవంటూ ఎన్జీటీకి నివేదిక

  • నదిని గుల్లచేశారంటూ ఎంఓఈఎఫ్‌ స్పష్టీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కాలం కంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి పనిచేసే కలెక్టర్లే కాదు... ‘కాలజ్ఞానం’ తెలిసిన కలెక్టర్లు కూడా ఉన్నారండోయ్‌..! పై నుంచి ఏ ఆదేశాలు వస్తాయో మూడు రోజులు ముందే ఊహించి అందుకనుగుణంగా పనిచేసేస్తారు..! సామాన్యులే కాదు తోటి ఐఏఎ్‌సలూ ఆశ్చర్యపోయేలా జగన్‌ జమానాలో ఇలాంటి కలెక్టర్లు పనిచేశారు. జగన్‌ పట్ల వీరభక్తి ప్రదర్శించి ‘ఘన కార్యాలు’ వెలగబెట్టారు.

ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గుంటూరు కలెక్టర్‌గా పనిచేసిన వేణుగోపాల్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 14న తనిఖీ చేసి, ఒకరోజు ముందుగానే అంటే... 13వ తేదీన ఎన్జీటీకి నివేదిక సమర్పించి ‘కాలమహిమ’ ప్రదర్శించారు. అలాగే తూర్పుగోదావరి కలెక్టర్‌గా పనిచేసిన మాధవీలతా రెడ్డి ఆయన కంటే రెండాకులు ఎక్కువే చదువుకున్నారు. ఇసుక రీచ్‌లు తనిఖీ చేయాలని ఫిబ్రవరి 5న ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వగా... మూడు రోజుల ముందే ఫిబ్రవరి 2వ తేదీన తనిఖీ చేసినట్లుగా నివేదిక పంపి ‘కాలజ్ఞాన’ ప్రతిభ చూపారు.

ఇదెలా సాధ్యమైంది? ఎన్జీటీ నుంచి ఇలాంటి ఆదేశాలు వస్తాయని ముందే ఏమైనా ఊహించారా? లేక కలగన్నారా? ఆ విషయం ఆమెకే తెలియాలి. ఒకవేళ ఎన్జీటీ ఆదేశాలు రావడానికి ముందే ఆమె ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి ఉండొచ్చు. కానీ ఎన్జీటీ ఆదేశించిన తర్వాత విధిగా మరోసారి ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలి. కోర్టు ఆదేశం కాబట్టి, అందుకనుగుణంగా తనిఖీ చేసి తాజా నివేదిక ఇవ్వాలి. కానీ ఆమె అలా చేయలేదు. ఎప్పుడో తనిఖీ చేసిన ఫొటోలను అప్‌లోడ్‌ చేసి, ఎన్జీటీ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లుగా నివేదికలో పేర్కొన్నారు.

ఇది కోర్టును మోసం చేసినట్లు కాదా? ఇసుక తవ్వకాల్లో అక్రమాలే లేవని నివేదికలు ఇవ్వాలని నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లకు లిఖితపూర్వక ప్రొఫార్మాలు పంపిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇలాంటి చిత్రాలు బయటపడుతున్నాయి.


రూల్స్‌ తెలియవా?

ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండ నాగేంద్ర ఎన్జీటీలో కేసు దాఖలు చేశారు. అక్రమ తవ్వకాలు జరిగాయని ఆయన పలు ఆధారాలు కోర్టుకు సమర్పించారు. అయితే, అవన్నీ అబద్ధాలే అని గనుల శాఖ అఫిడవిట్‌ వేసింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త విచారణ కమిటీ (జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌) ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ఫిబ్రవరి 14లోగా తమకు తనిఖీ నివేదికలను అందించాలని సూచించింది.

ఎన్జీటీ ఆదేశాల మేరకు కలెక్టర్లు ఫిబ్రవరి 10-13 తేదీల మధ్య తనిఖీలు చేసి నివేదికలు పంపారు. గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి ఫిబ్రవరి 14న తనిఖీ చేసి, అంతకు ఒకరోజు ముందుగానే అంటే... 13వ తేదీనే ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. ఇదెలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఎవరో తయారు చేసిన నివేదికపై ఆయన హడావుడిగా సంతకాలు పెట్టారని తెలుస్తోంది.

మరోవైపు కమిటీ తనిఖీల్లో అక్రమాలు కనిపెట్టినా దాచిపెట్టారు. ఏ అక్రమాలూ లేవని నివేదిక పంపించారు. తూర్పుగోదావరి కలెక్టర్‌గా పనిచేసిన మాధవీలత రెడ్డి ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వకముందే ఫిబ్రవరి 2వ తేదీన ఇసుక రీచ్‌లను తనిఖీ చేసినట్లుగా నివేదికలో పేర్కొన్నారు.

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని, గతంలో అక్రమ తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్జీటీ కూడా పాయింట్‌ అవుట్‌ చేసింది. మరోవైపు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌ పనులు బోట్లు నడుపుకునేవారి ఇంటర్నల్‌ మ్యాటర్‌ అంటూ వ్యవస్థనే తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. నిజానికి ఎవరు ఇసుక డ్రెడ్జింగ్‌ చేయాలన్నా పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే సీఓఈ, సీఓఓలు తప్పనిసరి. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమెకు ఈ మాత్రం తెలియదనుకోవాలా?

నిజాలు దాచి నివేదిక

తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అనేక రీచ్‌ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, భారీ యంత్రాలు వినియోగిస్తున్నారని గనుల శాఖ, రెవెన్యూ అధికారులు.. నాటి జిల్లా కలెక్టర్‌ మాధవీలతకు నివేదికలు ఇచ్చారు. వైసీపీ నేతల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, భారీ జేసీబీలతో నదిని గుల్లచేసి ఇసుక తోడేస్తున్నారని రెవెన్యూ అధికారులు నివేదించారు.

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నుంచి కన్సెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (సీఓఓ), క న్సెంట్‌ ఆఫ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (సీఓఈ)లు పొందకుండా డ్రె డ్జింగ్‌ పేరిట ఇసుక తవ్వుతున్నారని రెవెన్యూ అధికారులు పలు నివేదికలు ఇచ్చారు. కలెక్టర్‌గా మాధవీలత వీటిని బుట్టదాఖలు చేశారు. డ్రెడ్జింగ్‌ అనేది బోట్‌మెన్‌ ఇంటర్నల్‌ మ్యాటర్‌ అని దానిపై చర్చ జరగకుండా, ఎవరూ ఆరా తీయకుండా తప్పుదోవ పట్టించారు.

అయితే, ఇదే అంశంపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల బృందం తూర్పుగోదావరి జిల్లాలోని పలు రీచ్‌లను తనిఖీ చేసింది. రెండు టన్నుల బకెట్‌ ఉన్న జేసీబీలతో ఇసుక తవ్వేస్తున్నారని, సగటున ఒక మీటర్‌ లోతు కంటే ఎక్కువే నదిలో తవ్వుతున్నారని, కిలోమీటర్‌ పరిధిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. దీంతో కలెక్టర్‌ నివేదిక ఎంత గొప్పదో తేలిపోయింది.

Updated Date - Jun 30 , 2024 | 03:23 AM

Advertising
Advertising