జిల్లాస్థాయి పోటీల్లో చెందుర్తి విద్యార్థుల ప్రతిభ
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:24 AM
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ప్రయోగాలు, గణితం క్విజ్ పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): జిల్లాస్థాయిలో జరిగిన సైన్స్ ప్రయోగాలు, గణితం క్విజ్ పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచి బహుమతులు సాధించారు. క్రియా సంస్థ, అల్లం రాజు చారిటబుల్ ట్రస్టు సైన్స్ సెంటర్ సంయుక్తంగా పెద్దాపురంలో నిర్వహించిన పోటీల్లో పాఠశాల 5,6వ తరగతుల విద్యార్థులు జగ్గారపు భాగ్యలక్ష్మి, పలివెల గౌతమి వెంకటలక్ష్మి పది రూపాయిలతో మైక్రోస్కోప్ తయారుచేసి ప్రదర్శించారు. దీనికిగాను నగదు పురస్కారం, మెమో ంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులను ఎంఈవోలు వెంకటేశ్వరరావు, శివప్రసాద్, హెచ్‌ఎం సావిత్రి, విద్యాకమిటీ చైర్మన్ జగ్గారపు శ్రీనివాస్‌లు అభినందించారు.
Updated Date - Oct 22 , 2024 | 12:24 AM