ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: టీడీపీ- జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై హరిరామ జోగయ్య హర్షం

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:23 PM

టీడీపీ- జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Chegondi Harirama Jogaiah) హర్షం వ్యక్తం చేశారు.

ఏలూరు: టీడీపీ- జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Chegondi Harirama Jogaiah) హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నాడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 52 శాతం జనాభా ఉన్న బీసీలకు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హర్షనీయమని చెప్పారు.

బీసీలకు10 ప్రధాన సంక్షేమ పథకాలతో పాటు 11వ హామీగా రాజ్యాధికార దిశగా పయనం అంటూ హామీ ఇచ్చారని చెప్పారు. మరి రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న కాపులకు కూడా బీసీలకు సమాంతరంగా సంక్షేమ పథకాలతో డిక్లరేషన్ ప్రకటించాలని అన్నారు. ఒకప్పుడు బీసీలుగా గుర్తించబడిన కాపులను న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ బీసీల జాబితాలో చేర్చాలని అన్నారు. ఈ సమయంలో కాపులకు డిక్లరేషన్ ప్రకటించి వారి సంపూర్ణ మద్దతును ఈ కూటమి పొందుతుందని ఆశిస్తున్నానని హరిరామ జోగయ్య అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:02 PM

Advertising
Advertising