ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ ఆక్రమణలపై విచారణ నిర్వహించాలి

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:20 AM

తుని రూరల్‌, సెప్టెంబరు 6: గత వైసీపీ పాలనలో అడ్డుగోలుగా దోచుకున్న భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ నిర్వహించి గత పాల కుల అవినీతిని నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తేటగుంట టీడీపీ కార్యాయలంలో పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు,

అధికారులతో సమీక్షిస్తున్న యనమల

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

తుని రూరల్‌, సెప్టెంబరు 6: గత వైసీపీ పాలనలో అడ్డుగోలుగా దోచుకున్న భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ నిర్వహించి గత పాల కుల అవినీతిని నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తేటగుంట టీడీపీ కార్యాయలంలో పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు, తుని, తొం డంగి, కోటనందూరు మండల తహశీల్దార్లతో ని యోజకవర్గంలో పలు భూ అవకతవకలపై సమీక్ష నిర్వహించారు. తొండంగి మండలం కోదాడ లో ఉప్పుటేరు ట్యాంక్‌ ఆక్రమణపై స్థానికుల ఫి ర్యాదు మేరకు నిజ నిర్ధారణ కమిటీ నిర్వహించి వాస్తవాలను సేకరించామని, ఉప్పుటేరు గర్భంలో ఉన్న చేపల చెరువుల లైసెన్సులు తక్షణం రద్దు చేయాలని ఆదేశించారు. సాగు, తాగునీరు అవసరాలకనుగుణంగా ఉప్పుటేరును వినియోగించాలన్నారు. తుని పట్టణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం రాజుపేటలో కొనుగోలు చేసిన వం దల ఎకరాల్లో భూముల్లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని సంబంధిత లావాదేవీలు లేఅవుట్ల పంపిణీ వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేపట్టాలని కోరారు. మరోవైపు ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారాన్ని ప్రస్తావించి రైతులు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి వారి మధ్య సఖ్యత ఉండేలా అధికారులు చొరవతీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Sep 07 , 2024 | 12:20 AM

Advertising
Advertising