ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:01 AM

తుని రూరల్‌, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల
అధికారులతో మాట్లాడుతున్న యనమల

తుని రూరల్‌, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుని గొల్ల అప్పారావు సెంటర్లో ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆక్ర మించి నిర్మించిన బహుళ అంతస్తు భవనంపై యనమల ఆరా తీశారు. రేషన్‌ బియ్యం కొనుగోలు,తరలింపు,రీ సైక్లింగ్‌ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో పెద్దాపురం ఆర్డీవో సీతారామరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్‌ రావు, ఆర్‌ డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ సుభాష్‌, తుని మున్సిపాల్టీ అధికారులు ఉన్నారు. అలాగే తుని పట్టణంలో పలు అభివృద్థి కార్యక్రమాలపై కూటమి నాయకులతో యనమల సమీక్ష నిర్వహించారు. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, తుని టీడీపీ అధ్యక్షుడు యినిగంటి సత్యనారాయణ, టీడీపీ సీనియర్‌ నేత చింతమనీడి నాగసోమరాజు(అబ్బాయి), దంతులూరి శ్రీనివాసరాజు, లంకా సునీల్‌ తదితరులున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 12:01 AM

Advertising
Advertising