ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

ABN, Publish Date - Dec 14 , 2024 | 01:37 AM

అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలే

దొంగనోట్ల ముఠా వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ కృష్ణారావు

పోలీసులు అదుపులో 12 మంది సభ్యులు

రూ.లక్షా 33వేల విలువైన నోట్లు, ముద్రణ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన కోనసీమ జిల్లా ఎస్పీ

అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దొంగల నోట్ల ముఠా నుంచి రూ.లక్షా 33వేల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే సాంకేతిక పరికరాలు, యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు కేంద్రంగా దొంగనోట్ల ముఠా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తాటిపాక మఠం ప్రాంతానికి చెందిన కోళ్ల వీరవెంకటసత్యనారాయణ అనే పాస్టర్‌ యాక్సిస్‌ బ్యాంకు డిపాజిట్‌ నోట్‌లో రూ.500 నోట్లు 100 అంటే రూ.50వేలను డిపాజిట్‌ చేశారు. అయితే ఆ డిపాజిట్‌ సొమ్ము అంతా దొంగ నోట్లగా గుర్తించిన యాక్సిస్‌ బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 30వ తేదీన నమోదైన కేసుపై రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్‌, ఎస్‌ఐ బి.రాజేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పాస్టర్‌ కోళ్ల సత్యనారాయణను విచారించగా దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు అవడంతో ఈ మొత్తం ముఠా నెట్‌వర్క్‌ను చేధించారు. నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడిపించడంలో విభిన్న పాత్రలు పోషించిన 12 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ నోట్ల మూలాన్ని షేక్‌ మస్తాన్‌ నిర్వహిస్తున్న హనుమాన్‌ జంక్షన్‌ మండలం వీరవల్లి గ్రామంలోని ఎన్‌ఎంఎస్‌ ఇంటర్‌ప్రైజెస్‌ ద్వారా గుర్తించారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం, ఏజెంట్ల ద్వారా చెలామణి చేయడంలో వీరిపాత్ర కీలకంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ 12 మందితో పాటు మరికొంత మంది ప్రమేయం ఉన్నట్టు తేలిందని వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. పాస్టర్‌ సత్యనారాయణ అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డితో ఏర్పరుచుకున్న పరిచయం ద్వారా నకిలీ నోట్లు చెలామణి జరుగుతున్నట్టు తెలిపారు. రాఘవరెడ్డి ఏజెంట్లుగా మారాయ్య, గోపీలను షేక్‌ మస్తాన్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఎం ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నోట్లను పొందారు.

అరెస్టయిన వారు...

ఈ కేసులో కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకకు చెందిన కోళ్ల వీరవెంకటసత్యనారాయణ (58), ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన పాశర్లపూడి వెంకటసత్యనారాయణ అలియాస్‌ సతీష్‌ (42), రాయవరం మండలం వెంటూరుకు చెందిన పట్టపగలు మారయ్య (36), రామచంద్రపురం పట్టణానికి చెందిన ఉత్తరాల హరిఅప్పారావు (40),మాగంటి గోపి (33), కపిలేశ్వరపురం మండలం శ్రీరామపురానికి చెందిన బొక్కా శ్రీనివాస్‌ (40), తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవ అలియాస్‌రెడ్డి (67), కడియం మండలం వేమగిరికి చెందిన తుంపర దుర్గాప్రసాద్‌ (30), హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని గన్నవరం మండలానికి చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ వర్మ (42), కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన షేక్‌ హనీప్‌ (33), కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం బొడ్డువెంకటాయ పాలేనికి చెందిన కామేశ్వరరావు (40), పెదపూడికి చెందిన సుబ్బయ్య (42)ను అరెస్టు చేశారు.

అధికారులకు అభినందన

కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన కొత్తపేట డీఎస్పీ గోవిందరావు, సీఐ టీవీ నరేష్‌కుమార్‌, ఎస్‌ఐ బి.రాజేష్‌కుమార్‌, జిల్లా క్రైమ్‌ టీమ్‌ ఇన్‌చార్జి ప్రశాంత్‌కుమార్‌లతో పాటు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు అందజేశారు.

Updated Date - Dec 14 , 2024 | 01:37 AM